ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Meditation Benefits: ధ్యానం చేసేటప్పుడు ఇవి గుర్తుంచుకోవాలి

ABN, Publish Date - Aug 07 , 2025 | 01:52 AM

మానసిక ప్రశాంతతకు, చక్కని జ్ఞాపక శక్తికి ధ్యానం ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం చేసేటప్పుడు ఇతరత్రా ఆలోచనలు రాకుండా మనసు స్థిరంగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం...

మానసిక ప్రశాంతతకు, చక్కని జ్ఞాపక శక్తికి ధ్యానం ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం చేసేటప్పుడు ఇతరత్రా ఆలోచనలు రాకుండా మనసు స్థిరంగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం...

  • ధ్యానం కోసం నిశ్శబ్దంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. పచ్చని చెట్ల మధ్య గాలి బాగా వీచే చోట ధ్యానానికి ఉపక్రమించడం మంచిది. ఉదయాన్నే లేదా సాయంత్రం వేళ ఇంట్లో ప్రశాంతంగా ఉండే చోట కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు.

  • ధ్యానం చేస్తూ పక్షులు చేసే శబ్దాలు వినాలి. వీచే గాలితోపాటు చెట్లు, పూలు, మట్టి తదితరాలతో కూడిన ప్రకృతి నుంచి వచ్చే సువాసనలను ఆస్వాదించాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. శారీరక అలసట తగ్గుతుంది.

  • ధ్యానం చేసేటప్పుడు వచ్చే ఆలోచనలకు అడ్డుకట్ట వేసేందుకు శ్వాస మీద దృష్టి నిలపాలి. ఉఛ్వాస, నిశ్వాసాలను లెక్కిస్తూ ఉంటే ప్రయోజనం ఉంటుంది.

  • కళ్లు మూసుకుని ఇష్టమైన ప్రదేశాలను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. వర్షం, సూర్యోదయం, సూర్యాస్తమయం, చెట్లతో నిండిన అడవి లాంటి వాటిని ఊహిస్తూ ఉండాలి. దీనివల్ల వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి.

  • ఆలోచనలు ప్రారంభమవుతున్నప్పుడే వాటి నుంచి మనసును మరల్చాలి. రోజూ పది నిమిషాలు ఇలా చేస్తూ ఉంటే అనవసరమైన ఆలోచనలు రావడం క్రమంగా తగ్గుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో స్తతా చాటిన కూటమి

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

మరిన్నీ తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 07 , 2025 | 01:52 AM