GVMC: జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో స్తతా చాటిన కూటమి
ABN , Publish Date - Aug 06 , 2025 | 06:48 PM
విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను ఇప్పటికే కూటమిలోని పార్టీలు కైవసం చేసుకున్నాయి.
విశాఖపట్నం, ఆగస్ట్ 06: విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను ఇప్పటికే కూటమిలోని పార్టీలు కైవసం చేసుకున్నాయి. బుధవారం తాజాగా జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాల్లో సైతం మెజార్టీ స్థానాలు కూటమిలోని పార్టీ అభ్యర్థులకే దక్కాయి. మొత్తం 10 స్థానాల్లో తొమ్మిది కూటమి.. కేవలం ఒక్క స్థానం మాత్రం వైసీపీకి దక్కింది. అంటే 8 స్థానాల్లో టీడీపీ, ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ అతి కష్టం మీద ఈ సీటును గెలుచుకుందని తెలుస్తోంది. ఇక ఈ జీవీఎంసీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే గతేడాది స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం కూటమి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది.
ఈ రోజు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 92 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. అందుకే వైసీపీ ఘన విజయం సాధించిందనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. గతేడాది జరిగిన ఇవే ఎన్నికల్లో 10కి 10 స్థానాలు కూటమిలోని పార్టీలు గెలుచుకున్నాయి. కానీ ఈ సారి ఒక స్థానాన్ని కూటమి కోల్పోయింది. ఇక ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందడంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. అలాగే ఒక్క స్థానాన్ని ఎందుకు కోల్పోయామనే అంశంపై సైతం సమీక్షించు కుంటామని కూటమిలోని పార్టీల నేతలు పేర్కొన్నారు. దీంతో జీవీఎంసీలో కూటమి పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్నట్లు అయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
For AndhraPradesh News And Telugu News