ఫ్యాన్ శబ్దం చేస్తోందా?
ABN, Publish Date - Mar 19 , 2025 | 04:44 AM
ఎండాకాలం వచ్చేసింది. ఇళ్లలో రోజంతా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటోంది. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఒక్కోసారి శబ్దాలు వస్తుంటాయి. చిన్న చిట్కాలతో ఈ సమస్యల నుంచి...
ఎండాకాలం వచ్చేసింది. ఇళ్లలో రోజంతా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటోంది. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఒక్కోసారి శబ్దాలు వస్తుంటాయి. చిన్న చిట్కాలతో ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.
సీలింగ్ ఫ్యాన్ రెక్కలపై విపరీతంగా దుమ్ము చేరుతూ ఉంటుంది. దీనివల్ల ఫ్యాన్ తిరిగేటప్పుడు శబ్దం రావచ్చు. వారానికి ఒకసారి ఫ్యాన్‌ని, రెక్కలను పొడి గుడ్డతో తుడుస్తూ ఉంటే సమస్య తీరుతుంది.
రోజుల తరబడి ఫ్యాన్ తిరుగుతూ ఉండడం వల్ల రెక్కలకు ఉండే స్ర్కూలు లూజవుతాయి. దీనివల్ల కూడా ఫ్యాన్ నుంచి శబ్దాలు రావచ్చు. ఒకసారి వాటిని పరిశీలించి బిగిస్తే శబ్దాలు ఆగిపోతాయి.
రెక్కలు కొద్దిగా వంగినా కూడా ఫ్యాన్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావచ్చు. ఫ్యాన్ రెక్కలను వంకర లేకుండా సరిచేస్తే సమస్య తీరుతుంది.
ఫ్యాన్ తిరగడానికి ఉపకరించే భాగాలు పొడిగా మారినప్పుడు కూడా ఇదే సమస్య ఎదురుకావచ్చు. వాటిలో కొద్దిగా కొబ్బరి నూనె వేస్తే ఫలితం కనిపిస్తుంది.
ఫ్యాన్‌ని నేరుగా సీలింగ్‌కు బిగించినా కూడా శబ్దాలు రావచ్చు. ఫ్యాన్‌కు, సీలింగ్‌కూ మధ్య రబ్బర్ కుషన్ అమరిస్తే సమస్య తీరుతుంది.
ఇవి కూడా చదవండి..
Shocking Video: సముద్రంపై ఓడ.. కమ్ముకొస్తున్న తుఫాను.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి..
Viral Stunt Video: వామ్మో.. ఈ కుర్రాడి ట్యాలెంట్ చూస్తే అబ్బురపోవాల్సిందే.. వీడియో వైరల్..
Lion Viral Video: సింహం పిల్ల చిలిపి పని.. ఉలిక్కి పడిన మృగరాజులు.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 19 , 2025 | 04:44 AM