Share News

Viral Stunt Video: వామ్మో.. ఈ కుర్రాడి ట్యాలెంట్ చూస్తే అబ్బురపోవాల్సిందే.. వీడియో వైరల్..

ABN , Publish Date - Mar 18 , 2025 | 02:57 PM

స్టంట్, యాక్షన్ వీరులు తమ ప్రతిభను అందరికి చేరవేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో కళ్లు చెదిరే స్టంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం మరింత అద్భుతంగా ఉంది.

Viral Stunt Video: వామ్మో.. ఈ కుర్రాడి ట్యాలెంట్ చూస్తే అబ్బురపోవాల్సిందే.. వీడియో వైరల్..
Viral Stunt

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది ప్రతిభ వెలుగులోకి వస్తోంది. మారుమూల ప్రాంతాలకు చెందిన వారు కూడా తమ ట్యాలెంట్‌ను ప్రదర్శించడానికి సోషల్ మీడియా ఒక వేదికలా మారింది. స్టంట్, యాక్షన్ వీరులు తమ ప్రతిభను అందరికి చేరవేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో కళ్లు చెదిరే స్టంట్ వీడియోలు (Stunt Video) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం మరింత అద్భుతంగా ఉంది. ఆ వీడియోలోని కుర్రాడి ప్రతిభ చూస్తే నివ్వెరపోవాల్సిందే.


praveen_prajapat1 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు ఇంటి డాబా మీద అసాధారణమైన ఫీట్ చేశాడు. తన తలపై వరుసగా నీళ్లతో నిండిన గాజు గ్లాసులను ఒకదానిపై ఒకటి పెట్టాడు. అలా నిలువుగా ఒకదానిపై ఒకటి నీటితో నిండిన దాదాపు పది గాజు గ్లాసులను పెట్టాడు. ఆ గ్లాసులపై ఓ కుండ కూడా పెట్టుకున్నాడు. అవి పెట్టుకోవడమే కాకుండా, కాళ్లు కదుపుతూ డ్యాన్స్ కూడా చేశాడు. ఎలాంటి పొరపాటు జరగకుండా ఆ ఫీట్ చేశాడు. ఏమాత్రం తేడా వచ్చినా అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. 4.8 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ వీడియో చూసిన తర్వాత తన కాళ్లు వణుకుతున్నాయని ఒకరు కామెంట్ చేశారు. ఈ బ్రదర్ ట్యాలెంట్‌ను ఎంత పొగిడినా తక్కువే అంటూ మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ కళ్ల సత్తాను తేల్చే పజిల్ ఇది.. ఈ అడవిలోని జిరాఫీని 5 సెకెన్లలో కనుక్కోండి..


Lion Viral Video: సింహం పిల్ల చిలిపి పని.. ఉలిక్కి పడిన మృగరాజులు.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 18 , 2025 | 02:57 PM