ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Inner Wheel Women Club: యాభైల్లో యువతుల్లా

ABN, Publish Date - Sep 03 , 2025 | 02:44 AM

ప్రపంచవ్యాప్తంగా సమాజ సేవ, స్నేహసంబంధాల కోసం కృషి చేస్తోన్న అంతర్జాతీయ మహిళా సంస్థ... ‘ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌’ తాజాగా హైదరాబాద్‌లో మొట్టమొదటి ఇన్నర్‌ వీల్‌ ఛాంపియన్స్‌ క్రికెట్‌ లీగ్‌ను ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్‌లో...

ప్రేరణ

ప్రపంచవ్యాప్తంగా సమాజ సేవ, స్నేహసంబంధాల కోసం కృషి చేస్తోన్న అంతర్జాతీయ మహిళా సంస్థ... ‘ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌’ తాజాగా హైదరాబాద్‌లో మొట్టమొదటి ఇన్నర్‌ వీల్‌ ఛాంపియన్స్‌ క్రికెట్‌ లీగ్‌ను ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్‌లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు మహిళలు పాల్గొని, జీవితంలోని ఏ దశలోనైనా చురుగ్గా ఉండడం సాధ్యమేనని నిరూపించారు. ఆ విశేషాలు నవ్య పాఠకుల కోసం...

ఇన్నర్‌ వీల్‌... ప్రపంచంలోని అతి పెద్ద అంతర్జాతీయ స్వచ్ఛంద మహిళా సంస్థ. సమాజ సేవ, స్నేహ సంబంధాలను పెంపొందించడం లక్ష్యంగా 1924లో ఈ సంస్థను స్థాపించారు. రోటరీ ఇంటర్నేషనల్‌ సహకారంతో పని చేస్తున్న ఇన్నర్‌ వీల్‌... క్లబ్బులు, అసోసియేషన్ల ద్వారా నిధులను సమీకరిస్తూ, వెనుకబడిన వర్గాలకు, అనాథలకూ, మహిళలకూ సహాయపడుతూ ఉంటుంది. భారతదేశంలోని 27 ఇన్నర్‌ వీల్‌ జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించుకుని, వాటిలోని సభ్యులైన 44 మంది మహిళలు ఒక జట్టుగా ఏర్పడి హైదరాబాద్‌ ఇన్నర్‌ వీల్‌ ఛాంపియన్స్‌ క్రికెట్‌ లీగ్‌లో పాల్గొన్నారు. క్రికెట్‌ మ్యాచ్‌లో పాల్గొన్నారు కాబట్టి వీళ్లందరూ క్రికెట్‌ ప్లేయర్స్‌ అనుకుంటే పొరపాటు. స్నేహాభావాన్ని చాటుకోవడంతో పాటు, నడివయసులో సైతం ఆరితేరిన క్రికెటర్ల మాదిరిగా చురుగ్గా ఉండగలుగుతామని నిరూపించడం కోసమే మహిళలు ఈ లీగ్‌లో పాల్గొనడం చెప్పుకోదగిన విశేషం.

యాభైల్లో కొత్త జీవితం

మొదలవుతుంది

సమాజానికి సేవ చేయాలని కోరుకునే మహిళలు మనలో ఎంతోమంది ఉంటారు. అవసరంలో ఉన్న వారికి తమకు తోచిన సహాయాన్ని అందించాలని పరితపించే మహిళలూ ఉంటారు. ఇలాంటి మహిలందరికీ ఇన్నర్‌ వీల్‌ ఒకే వేదికగా ఉపయోగపడుతోంది. ఈ ఏడాది మేం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను చేపట్టాం. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశాం. ప్రజలకు ఈ సేవలన్నీ ఉచితమే! ఇన్నర్‌ వీల్‌ సభ్యుల్లో ఎక్కువ మంది పెళ్లైన మహిళలే! వీళ్లలో 45 నుంచి 60 ఏళ్ల వయసు మహిళలు ఈ క్రికెట్‌ లీగ్‌లో పాల్గొన్నారు. ఒక సంస్థలో భాగంగా సేవలు అందించాలనుకునే మహిళలు కేవలం సమాజానికే సేవలందిస్తూ అక్కడికే పరిమితమైపోకూడదు. నడివయసులో ఉన్నప్పటికీ శారీరకంగా దృఢంగా ఉన్నామని సాటి మహిళలకు నిరూపించగలగాలి. ఈ లక్ష్యంతో తాజా క్రికెట్‌ లీగ్‌ను ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా దాదాపు 200 మంది మహిళలు హైదరాబాద్‌లో జరిగిన క్రికెట్‌ లీగ్‌లో పాల్గొన్నారు. కొచ్చి, పంజాబ్‌, కోల్‌కతా, ముంబయి.. ఇలా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి సొంత ఖర్చులతో వాళ్లందరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు. నేను బెంగుళూరు నుంచి ఈ లీగ్‌లో పాల్గొన్నాను. నాకు 50 ఏళ్లు. కిర్లోస్కర్‌ హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాను. అలాగే ఇన్నర్‌ వీల్‌ డిస్ట్రిక్ట్‌ 316కు డిస్ట్రిక్ట్‌ ఛైర్మన్‌గా కూడా పని చేస్తున్నాను. దక్షిణ జోన్‌ కొఆర్డినేటర్‌ను నేనే కాబట్టి ఈ లీగ్‌లో పాల్గొనే ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడుల నుంచి మహిళలను నేనే ఎంపిక చేశాను. వాళ్లలో టీచర్లున్నారు, మహిళా వ్యాపారవేత్తలున్నారు. వీళ్లలో కొందరికి క్రికెట్‌ పూర్తిగా కొత్త. అయినప్పటికీ ఈ లీగ్‌లో పాల్గొనడం ద్వారా అమ్మమ్మల వయసులో సైతం చురుగ్గా ఉండొచ్చని నిరూపించగలిగారు.

- జయశ్రీ సాగర్‌,

ఇన్నర్‌ వీల్‌ డిస్ట్రిక్ట్‌ ఛైర్మన్‌, బెంగుళూరు.

గోగుమళ్ల కవిత

అపరిమిత సేవలే మా లక్ష్యం

ఈ క్రికెట్‌ లీగ్‌లో 27 జిల్లాలకు చెందిన ఇన్నర్‌ వీల్‌ మహిళలు పాల్గొన్నారు. వీళ్లందరూ స్నేహబంధాన్నీ, క్రీడాస్ఫూర్తినీ చాటుకోవడమే ప్రధానంగా ఈ లీగ్‌లో పాల్గొన్నారు. ఇక్కడ గెలుపోటములు ప్రధానం కాదు. ఇన్నర్‌ వీల్‌లోని మహిళా సభ్యులందరినీ చేరువ చేయడం, సాటి మహిళలకు ప్రేరణగా మారడమే ఈ క్రికెట్‌ లీగ్‌ లక్ష్యం. నిజానికి ఇన్నర్‌ వీల్‌లోని మహిళలందరూ సేవ ద్వారా పరస్పరం అనుబంధాన్ని పెంపొందించుకున్నవారే! మా ఉమ్మడి లక్ష్యం ఒకటే కాబట్టి అందరి మధ్యా దృఢమైన అనుబంధం ఉంటుంది. ఇన్నర్‌ వీల్‌ స్వచ్ఛంద సంస్థలాగే పని చేస్తుంది. కానీ ఇది స్వచ్ఛంద సంస్థ కాదు. 100కు పైగా దేశాలు ఇన్నర్‌వీల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. భారతదేశంలోనే 17 వేల ఇన్నర్‌ వీల్‌ క్లబ్బులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1.2 లక్షల మంది మహిళా సభ్యులు ప్రపంచవ్యాప్తంగా సమాజసేవలో పాల్గొంటున్నారు. ఈ సంస్థ తరఫున అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, మహిళా సాధికారతల కోసం నిధులను సేకరిస్తూ ఉచిత సహాయసహకారాలు అందిస్తూ ఉంటాం. పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పనలో సహాయపడడంతో పాటు, ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం. పాఠశాలల్లో, కాలేజీల్లో చెట్లు నాటే కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. ప్రతి ఏటా ఒక లక్ష విత్తన బంతులను పంపిణీ చేస్తూ, పర్యావరణానికి సహాయపడుతున్నాం. నిమ్స్‌ ఆస్పత్రిలో కీమో వార్డులో చికిత్స పొందే పిల్లలకు లైబ్రరీని ఏర్పాటు చేశాం. ఇటీవలే గాంధీ ఆస్పత్రి మెటర్నటీ వార్డుకు స్ట్రెచర్స్‌, వీల్‌ ఛైర్స్‌, ఇంక్యుబేటర్స్‌ను అందించాం. ఇలా మేం అందించే సేవలకు ఒక పరిమితంటూ ఉండదు. ఎవరికి ఏ సహాయం అవసరమో గుర్తించి, ఆ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా మేం ముందుకు వెళ్తూ ఉంటాం!

స్వర్ణలత, డిస్ట్రిక్ట్‌ ఛైర్మన్‌, హైదరాబాద్‌.

వయసు...

పరిమితి కాదు ప్రేరణ

ఇన్నర్‌ వీల్‌ అంతర్జాతీయ ప్రెసిడెంట్‌, ఆస్ట్రేలియాకు చెందిన కే మోర్లాండ్‌, హైదరాబాద్‌లో జరిగిన ఛాంపియన్స్‌ క్రికెట్‌ లీగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘భారత్‌ అద్భుతమైన దేశం. భారత్‌, ఆస్ట్రేలియా రెండూ క్రికెట్‌ ఆడతాయి. ఈ ఆటను అమితంగా ప్రేమిస్తాయి. అభిరుచి, ప్రతిభలకు లింగబేధం లేదని నిరూపిస్తూ, ఈ మహిళా క్రికెట్‌ జట్టు, ఆట నియమాలను తిరగరాస్తోంది. స్థానిక మైదానాల నుంచి ప్రపంచ స్టేడియంల వరకూ, మహిళా క్రికెటర్లు కొత్త తరాలకు స్ఫూర్తిగా మారుతూనే ఉన్నారు. వయసు ఒక పరిమితి కాదు, ఒక ప్రేరణ. జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఈ యుగంలో, జీవితంలోని ఏ దశలోనైనా చురుగ్గా, సాహసోపేతంగా ఉండడం సాధ్యమేనని ఈ మహిళలు నిరూపించారు’’ అని ఆమె ప్రసంగించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసులపై కాల్పులు.. రేప్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పరార్..

సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర

For More National News

Updated Date - Sep 03 , 2025 | 02:46 AM