Indian Railways NonTechnical Jobs: ఇండియన్ రైల్వేల్లో ఉద్యోగాలు
ABN, Publish Date - Oct 13 , 2025 | 07:25 AM
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 8050 ఉద్యోగాలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ్‌స (గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 5000 పోస్టులు...
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్
(గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్)
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 8050 ఉద్యోగాలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ్‌స (గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 5000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3050 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ పోస్టుల దరఖాస్తులు 2025 అక్టోబర్ 21 నుంచి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల దరఖాస్తులు 2025 అక్టోబర్ 28 నుంచి ప్రారంభం అవుతాయి. గ్రాడ్యుయేట్ పోస్టుల చివరి తేదీ 2025 నవంబర్ 20, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల చివరి తేదీ 2025 నవంబర్ 27.
గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులలో గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్, ట్రాఫిక్ అసిస్టెంట్ ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, రైళ్ల క్లర్క్ ఖాళీలు ఉన్నాయి.
వయస్సు: గ్రాడ్యుయేట్ పోస్టులకు 18 నుంచి 33, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 16-33 ఏళ్ల లోపు ఉండాలి. జోన్లు, విభాగాల వారీగా ఖాళీలతో నోటిఫికేషన్ త్వరలో వెలువడుతుంది.
జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్
భారతీయ రైల్వే 2570 పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే డివిజన్లలో ఉన్న కింద పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దరఖాస్తులను కోరుతోంది.
పోస్టులు: జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్.
(పూర్తి వివరాలతో నోటిఫికేషన్ త్వరలో వెలువడుతుంది. దీని కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి.)
వయస్సు: అభ్యర్థుల వయస్సు 2026 జనవరి 1 నాటికి 18-33 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
దరఖాస్తులు ప్రారంభం: 2025 అక్టోబర్ 30
చివరి తేదీ: 2025 నవంబర్ 30
రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, సికింద్రాబాద్, బిలా్‌సపూర్, చంఢీగఢ్, చెన్నై, గువహటి, గోరఖ్‌పూర్, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబాయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం,
వెబ్‌సైట్: https://rrbsecunderabad.gov.in/
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News
Updated Date - Oct 13 , 2025 | 07:34 AM