Tricolor Food For Celebrations: తిరంగా పలావ్
ABN, Publish Date - Aug 14 , 2025 | 12:39 AM
కావాల్సిన పదార్థాలు :బాస్మతి బియ్యం, నెయ్యి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, రెడ్ చిల్లీ పేస్టు, పసుపు, కేరట్ ప్యూరీ, పాలక్ ప్యూరీ, మిరియాల పొడి, గరం మసాల పొడి, ఉప్పు- తగినంత...
తిరంగా ట్రీట్..!
కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం, నెయ్యి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, రెడ్ చిల్లీ పేస్టు, పసుపు, కేరట్ ప్యూరీ, పాలక్ ప్యూరీ, మిరియాల పొడి, గరం మసాల పొడి, ఉప్పు- తగినంత
తయారీ విధానం
ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి పొడిపొడిగా ఉండేలా వండుకోవాలి.
ఆరెంజ్ రైస్: స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక చెంచా నెయ్యి వేసి వేడి చేయాలి. అర చెంచా జీలకర్ర, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, పావు చెంచా పసుపు, అర కప్పు కేరట్ ప్యూరీ, ఒక చెంచా రెడ్‌చిల్లీ పేస్టు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తరవాత ఒక కప్పు బాస్మతి అన్నం వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి.
వైట్ రైస్: ఒక కప్పు బాస్మతి అన్నంలో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.
గ్రీన్ రైస్: స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా రెడ్ చిల్లీ పేస్టు, ఒక చెంచా గరం మసాల పొడి, ఒక కప్పు పాలక్ ప్యూరీ, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తరవాత స్టవ్ మీద నుంచి దించాలి.
సర్వింగ్ ప్లేట్ మీద ఒక మౌల్డ్‌ను ఉంచాలి. ఇందులో గ్రీన్ రైస్‌ను లేయర్‌లా వేయాలి. తరవాత వైట్ రైస్‌ను వేసి సర్దాలి. పైన ఆరెంజ్ రైస్‌ను వేసి లోపలికి ఒత్తాలి. ఇప్పుడు మెల్లగా మౌల్డ్‌ను తీసివేయాలి. తిరంగా పలావ్ తినడానికి రెడీ..!
చెఫ్: రూప నబర్, టిటికె ప్రిస్టేజ్
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 14 , 2025 | 12:39 AM