Banking Jobs Recruitment: బ్యాంకింగ్ ఉద్యోగాలు
ABN, Publish Date - Jul 07 , 2025 | 05:12 AM
ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీల కోసం ఐబీపీఎస్ (ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) నోటిఫికేషన్ విడుదల చేసింది...
ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ
ఖాళీలు 5208
ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీల కోసం ఐబీపీఎస్ (ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 5208 పోస్టులు ఉన్నాయి.
అర్హత: గ్రాడ్యుయేషన్
వయస్సు: 2025 జూలై 1 తేదీ నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల కోసం ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నారు.
చివరి తేదీ: 2025 జూలై 21
వెబ్‌సైట్: https://www.ibps.in/
స్పెషలిస్ట్ ఆఫీసర్లు
ఖాళీలు 1007
పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 1007 స్పెషలిస్ట్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ కోసం ఐబీపీఎ్‌స నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఐబీపీఎస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: పోస్టులను అనుసరించి బీఎస్సీ, బీటెక్, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ, ఎంఆర్క్, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ/పీజీడీఎం, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 2025 జూలై 1 తేదీ నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 2025 జూలై 21
వెబ్‌సైట్: https://www.ibps.in/
ఈ వార్తలు కూడా చదవండి
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం
డిజిటల్ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 07 , 2025 | 05:12 AM