ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Beauty Tips: మదర్స్‌ డే మేకప్‌

ABN, Publish Date - May 10 , 2025 | 03:40 AM

మదర్స్‌ డే రోజు మేకప్‌ సహాయంతో చర్మపు గీతలు, మచ్చలను దాచేసి మెరిసిపోవచ్చు. సరైన హైడ్రేషన్‌, ద్రవరూప ఫౌండేషన్‌, తడిపిన స్పాంజ్‌ వాడకం వంటి చిట్కాలతో సహజసిద్ధంగా అందంగా కనిపించవచ్చు.

మదర్స్‌ డే నాడు మనోహరంగా కనిపించాలంటే 30 ఏళ్లు పైడిన తర్వాత ముఖంలో ప్రతిఫలించే గీతలు, మచ్చలను మేక్‌పతో దాచేయాలి. తోటి తల్లులందరిలో మెరుపులీనుతూ కనిపించడం కోసం... ఇవిగో ఈ ప్రాథమిక మేకప్‌ చిట్కాలు పాటించండి.

హైడ్రేషన్‌ కోసం: వేసుకునే మేకప్‌ ముఖం మీద సమంగా పరుచుకోవడం కోసం ముందుగా చర్మాన్ని సిద్ధం చేయాలి. అందుకోసం ఫేసియల్‌ సీరమ్‌ను ముఖం మీద అద్దుకోవాలి. ఈ సీరం జిడ్డుగా ఉండకుండా చర్మానికి తేమతో పాటు, సన్‌స్ర్కీన్‌ రక్షణ కూడా అందించేలా ఉండాలి. ఈ సీరమ్‌ చర్మంలో చక్కగా ఇంకిపోయిన తర్వాతే మేకప్‌ మొదలు పెట్టాలి.

ద్రవరూప ఫౌండేషన్‌: ముఖం మీద ఉండే సన్నని గీతల్లో ఇరుక్కుపోయి ఎబ్బెట్టుగా కనిపించకుండా ఉండాలంటే తేలికపాటి ద్రవరూప ఫౌండేషన్‌ ఎంచుకోవాలి. ఈ రకమైన ఫౌండేషన్‌ చర్మం మీద పలుచగా పొరలా ఏర్పడి ఆ తర్వాత వేసుకోబోయే కాంపాక్ట్‌, బ్లష్‌లకు అనువుగా ఉంటుంది. అయితే ఫౌండేషన్‌ను నేరుగా అప్లై చేసుకోకుండా, మొదట ముఖమంతా అక్కడక్కడా చుక్కలుగా అద్దుకుని, ఆ తర్వాత స్పాంజ్‌తో ముఖమంతా పరుచుకునేలా చేయాలి


తడిపిన స్పాంజ్‌తో: ఫౌండేషన్‌, కన్‌సీలర్‌ల కోసం తడిపి పిండిన మేకప్‌ స్పాంజ్‌ వాడుకోవాలి. ఈ పద్ధతితో మేకప్‌ ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. మరింత సహజసిద్ధంగా కనిపిస్తుంది. అయితే స్పాంజి తేమగా ఉండాలే తప్ప నీరు కారుతూ ఉండకూడదు. అందుకోసం స్పాంజిబి గోరువెచ్చని నీటి ధార కింద ఉంచి, గట్టిగా పిండేయాలి.

ద్రవరూప బ్లష్‌: బ్లష్‌తో అందం రెట్టింపవుతుంది. అయితే అందుకోసం సరైన రంగులను ఎంచుకోవాలి. ముదురు రంగు బ్లష్‌లు, మరీ మెత్తని పౌడర్‌ రూపంలో ఉండే బ్లష్‌లు ఎబ్బెట్టుగా కనిపిస్తూ, చర్మపు గీతల్లో ఇరుక్కుపోతాయి. కాబట్టి పౌడర్‌ బ్లష్‌లకు బదులుగా ద్రవరూప బ్లష్‌లు ఎంచుకోవాలి. వీటిని కూడా తడిపి పిండిన స్పాంజితోనే అద్దుకోవాలి.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 03:40 AM