సాలె పురుగులతో ఇబ్బందా
ABN, Publish Date - Jun 29 , 2025 | 03:41 AM
సాధారణంగా ఇంట్లో పైకప్పు మీద, సామాన్ల మధ్య సాలె పురుగులు గూళ్లు అల్లుతూ ఉంటాయి. ఇవి అంత ప్రమాదకరం కానప్పటికీ వీటివల్ల ఇల్లు అపరిశుభ్రంగా...
సాధారణంగా ఇంట్లో పైకప్పు మీద, సామాన్ల మధ్య సాలె పురుగులు గూళ్లు అల్లుతూ ఉంటాయి. ఇవి అంత ప్రమాదకరం కానప్పటికీ వీటివల్ల ఇల్లు అపరిశుభ్రంగా ఉందనే భావన వస్తుంది. ఈ సాలె పురుగులను సులువుగా తొలగించే చిట్కాల గురించి తెలుసుకుందాం...
అయిదు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి ఒక స్ర్పే బాటిల్‌లో వేసి నిండుగా నీరు పోయాలి. రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే ఈ నీటిని సాలె పురుగులు గూళ్లు అల్లే ప్రదేశాల్లో పిచికారీ చేస్తే అవి వెంటనే బయటికి వెళ్లిపోతాయి. మళ్లీ రావు.
కర్పూరం, తులసి, లావెండర్, సిట్రోనెల్లా, పుదీనా నూనెల్లో ఒకదాన్ని తీసుకుని ఒక గ్లాసు నీళ్లలో అయిదు చుక్కలు వేసి బాగా కలపాలి. ఈ నీటిని గది మూలలు, తలుపు సందులు, కిటికీల వద్ద చల్లితే సాలె పురుగులు చేరవు. ఇల్లు సువాసనతో నిండుతుంది.
ఒక బకెట్ నీళ్లలో రెండు చెంచాల వెనిగర్ లేదా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ నీటిలో స్పాంజ్ లేదా పలుచని బట్టను ముంచి దానితో ఫర్నిచర్, ఫ్యాన్లు, బల్బులు, తలుపులు తదితరాలను తుడిచేస్తే సమస్య తీరుతుంది.
గది మూలల్లో, సోఫాకి ఇరుపక్కలా, వంటగది కిటికీలో, బాల్కనీ గోడల మీద పుదీనా, రోజ్‌మేరీ, లావెండర్ మొక్కల కుండీలు ఉంచినా మంచి పలితం కనిపిస్తుంది. ఈ మొక్కలు ఇంట్లో తాజాదనాన్ని నింపుతాయి.
నిమ్మ, కమలాలు, బత్తాయిలాంటి సిట్రస్ పండ్ల తొక్కలను ఎండబెట్టి ఒక గిన్నెలో వేసి గది మూలల్లో ఉంచితే సాలె పురుగులు రావు.
ఒక చెంచా బేకింగ్ సోడా లేదా పొగాకు పొడి కలిపిన నీళ్లను గది మూలల్లో పిచికారీ చేస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది.
కనీసం ఆర్నెలకు ఒకసారి ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకుని అవసరం లేని సామాన్లను తొలగిస్తే సాలెపురుగులు చేరవు.
ఇవి కూడా చదవండి
పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్
Updated Date - Jun 29 , 2025 | 04:28 PM