Hot Coffee: కాలిపోయే కాఫీలతో క్యాన్సర్
ABN, Publish Date - Sep 02 , 2025 | 04:00 AM
మనలో చాలా మందికి ఉదయాన్నే పొగలు కక్కే కాఫీ గొంతు దిగందే రోజు మొదలవ్వదు. అయితే 65 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించిన కాఫీలు, టీలతో నోరు కాలితే ఫర్వాలేదు. అత్యంత ప్రమాదకరమైన అన్నవాహిక క్యాన్సర్ ముప్పు పెరుగుతుందనే...
మనలో చాలా మందికి ఉదయాన్నే పొగలు కక్కే కాఫీ గొంతు దిగందే రోజు మొదలవ్వదు. అయితే 65 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించిన కాఫీలు, టీలతో నోరు కాలితే ఫర్వాలేదు. అత్యంత ప్రమాదకరమైన అన్నవాహిక క్యాన్సర్ ముప్పు పెరుగుతుందనే ఒక అధ్యయనం నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అండ్ గ్లోబల్ స్టడీ్‌సలో ప్రచురితమైంది. పదే పదే అన్నవాహిక వేడి పానీయాలకు బహిర్గతమైనప్పుడు, ఇన్‌ఫ్లమేషన్ తలెత్తి, కణాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిజానికి వేడి పానీయాలు క్యాన్సర్ ముప్పును పెంచుతాయనే విషయం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ గత కొన్నేళ్లుగా వేడి పానీయాలకూ, క్యాన్సర్‌కూ మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేస్తోంది. ఈ సంస్థ, 65 డిగ్రీలకు మించిన వేడి పానీయాలను క్యాన్సర్ కారకాలుగా వర్గీకరించింది. ఇక్కడ తాగే పానీయంతో సంబంధం లేదు. టీ, కాఫీ, గ్రీన్ టీ, సూప్, వేడి నీళ్లు... ఇలా 65 డిగ్రీలకు మించి వేడిగా ఉన్న ఏ పానీయాన్ని తాగినా అన్నవాహిక లోపలి పొర దెబ్బతిని, కణాల్లో మార్పులు చోటుచేసుకుని, ఆ పరిస్థితి క్యాన్సర్‌కు దారి తీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. వేడి టీ లేదా నీళ్లు ఎక్కువగా తాగే అలవాటున్న ఇరాన్, చైనా, దక్షిణమెరికా ప్రజల్లో అత్యధికంగా అన్నవాహిక క్యాన్సర్ బయల్పడడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సందర్భంగా ప్రస్థావిస్తోంది. ఇలాంటప్పుడు ఎంత వేడి పానీయాలు తాగడం సురక్షితం అనే ప్రశ్న తలెత్తవచ్చు. పెదవులు కాలేంత వేడిగా ఉండే టీ లేదా కాఫీ కచ్చితంగా అన్నవాహికను కూడా కాలుస్తుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి. అంత వేడిగా ఉన్నవి కనీసం 70 నుంచి 85 డిగ్రీల సెల్షియ్‌సను కలిగి ఉంటాయి. కాబట్టి టీ అయినా, కాఫీ అయినా సౌకర్యవంతంగా తాగే వీల్లేనంత వేడిగా ఉన్నప్పుడు, కాస్త చల్లారిన తర్వాతే తాగడం అలవాటు చేసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
హరీష్ రావును టార్గెట్ చేసింది అందుకేనా..?
For More AP News And Telugu News
Updated Date - Sep 02 , 2025 | 04:00 AM