Share News

TG Govt: తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

ABN , Publish Date - Sep 01 , 2025 | 05:39 PM

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏర్పాటుకు సోమవారం కమిటీని ఏర్పాటు చేసింది.

TG Govt: తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

హైదరాబాద్, సెప్టెంబర్ 01: తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారుడు కె. కేశవరావును నియమించింది. ఆయనతో సహా ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా మెంబర్ కన్వీనర్‌‌గా వ్యవహరించనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ, సీఎస్ రామకృష్ణారావు, ఉన్నత విద్య మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.


మరో సభ్యుడిని ఎంపిక చేసే స్వేచ్ఛను ఈ కమిటీ చైర్మన్‌కు కల్పిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ కమిటీ జాతీయ విద్య పాలసీ 2020ని రాష్ట్రానికి అనుకూలంగా అమలు చేసే అంశంపై అధ్యయనం చేయడం.. అలాగే జాబ్‌ మార్కెట్‌కు అనుగుణంగా స్కిల్స్ పెంచడం కోసం ఎడ్యుకేషన్ ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించాలని పేర్కొంది. ఇందులో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఇన్నోవేషన్, ఎంట్రెప్రన్యూయర్ షిప్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోనేందుకు పెద్ద పీట వేయాలని సూచించింది.


ఇక విద్య సంస్థలు, పరిశ్రమల మధ్య పరిశోధన సహకారం ఏర్పాటుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని స్పష్టం చేసింది. పాఠశాలలు, ఉన్నత విద్య సంస్థలు, టెక్నికల్, ఒకేషనల్, ప్రొఫెషనల్ కోర్సులను అందరికి అందుబాటులోకి తీసుకురావడం.. అలాగే సమానత్వం సాధించడం కోసం తీసుకురావాల్సిన సంస్కరణలపై సలహాలు ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఆయా అంశాలపై అధ్యయనం చేసి.. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అవినీతి జరిగిందని ఒప్పుకున్న కవిత: కాంగ్రెస్ నేతలు

వారికి.. సీఎం వార్నింగ్

For More TG News And Telugu News

Updated Date - Sep 01 , 2025 | 06:04 PM