Congress Party Vs Kalvakuntla Kavitha: అవినీతి జరిగిందని ఒప్పుకున్న కవిత: కాంగ్రెస్ నేతలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:17 PM
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు. దీనిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. అలాంటి వేళ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 01: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కొందరు కుట్రలు చేస్తున్నారని.. వారి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారంటూ తెలంగాణ జాగృతి అధినేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సోమవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మొత్తానికి రూ. లక్షల కోట్ల అవినీతి జరిగిందని కల్వకుంట్ల కవిత ఒప్పుకుందని హస్తం నేతలు స్పష్టం చేశారు.
అయితే వాస్తవాలు మాట్లాడితే.. కల్వకుంట్ల కవితను సైతం వదిలి పెట్టరని వారు పేర్కొన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలోని కలహాలను తమపై రుద్దడం ఏమిటని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, సంతోష్ రావులు ఆరోపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేశారు. కవిత మరో డ్రామాకు తెర లేపిందంటూ కాంగ్రెస్ నేతలు వ్యంగ్యంగా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News