Big Breaking: వారికి.. సీఎం వార్నింగ్
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:03 PM
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు పది సార్లు ఆలోచించాలని నెటిజన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సోషల్ మీడియా వేదికగా మహిళల ఆత్మగౌరవం దెబ్బ తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెటిజన్లకు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
రాయచోటి, సెప్టెంబర్ 01: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు పది సార్లు ఆలోచించాలని నెటిజన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సోషల్ మీడియా వేదికగా మహిళల ఆత్మగౌరవం దెబ్బ తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెటిజన్లకు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా బోయనపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం మనకు అనేక కష్టాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఆ క్రమంలో 2014 -19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్‌లో చేసి చూపించామన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న మామిడి రైతులను తాము ఆదుకున్నామని చెప్పారు. అయితే మామిడి రైతులకు మద్దతు ధర లేదంటూ మామిడి కాయలను రహదారులపై పోసి వైసీపీ డ్రామాలు ఆడిందని మండిపడ్డారు.
గంగానది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలని ఆయన ఆకాంక్షించారు. వంశధార నుంచి గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ప్రజలు ఆశీర్వదిస్తే చాలు.. కొండలనైనా పిండి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఒంటిమిట్టను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దత్తత తీసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. తమ దృష్టిలో రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరని సీఎం చంద్రబాబు క్లియర్ కట్‌గా స్పష్టత ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మందు బాబులకు మరో గుడ్ న్యూస్.. అర్థరాత్రి నుంచి..
వైఖరి మార్చుకో వైఎస్ జగన్: ఎమ్మెల్యే యార్లగడ్డ
For More AP News And Telugu News