Bars in Andhra Pradesh: మందు బాబులకు మరో గుడ్ న్యూస్.. అర్థరాత్రి నుంచి..
ABN , Publish Date - Sep 01 , 2025 | 03:19 PM
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. నూతన బార్ పాలసీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి, సెప్టెంబర్ 01: రాష్ట్రంలో నేటి నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.00 గంటల నుంచి అర్థరాత్రి 12.00 గంటల వరకు బార్లు తెరచి ఉండనున్నాయి. ఈ విధానం సోమవారం నుంచి అంటే.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో దేశంలోని అన్ని ముఖ్య నగరాలలో దాదాపుగా ఇదే విధానం అమలు అవుతోంది. దాంతో ఆ యా నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సైతం చేరినట్లు అయింది.
ఈ నూతన బార్ పాలసీ 2025 నుంచి 2028 వరకు అమలులో ఉండనుంది. అయితే గతంలో పాత పాలసీ ప్రకారం.. రాత్రి 11.00 గంటలకు బార్లను మూసి వేయాల్సి ఉండేది. కానీ నూతన విధానంతో ఒక గంట మేర బార్లను నిర్వహించుకోనే విధానాన్ని నిర్వాహకులకు ఈ పాలసీ ద్వారా ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఈ ఉత్తర్వుల్లో భాగంగా 10 శాతం మద్యం షాపులను కల్లు గీత కులాలకు కేటాయించిన విషయం విదితమే.
దేశంలోని వివిధ నగరాల్లో ఈ విధంగా..
న్యూఢిల్లీ ( క్యాపిటల్ రిజియన్): బార్లు, రెస్టారెంట్లలో అర్థరాత్రి 1.00 వరకు మద్యం సరఫరా చేస్తారు.
ముంబై (మహారాష్ట్ర): అర్థరాత్రి 1:30 మూసి వేస్తారు.
చెన్నై (తమిళనాడు): అర్థరాత్రి 12.00 గంటలకు పబ్‌లు మూసివేస్తారు.
హైదరాబాద్( తెలంగాణ): అర్థరాత్రి 12.00 గంటలకు మూసి వేస్తారు.
కోల్‌కతా( పశ్చిమబెంగాల్): అర్థరాత్రి 12.00 గంటలకు బార్లు మూసివేస్తారు.
చంఢీగఢ్ : మామూలు రోజుల్లో పబ్‌లు అర్థరాత్రి 1.00 వరకు.. వారాంతంలో మాత్రం అర్థరాత్రి 2.00 గంటల వరకు పబ్‌లు తెరచి ఉంచుతారు.
బెంగళూరు (కర్ణాటక): మామూలు రోజుల్లో రాత్రి 11.30 గంటల వరకు.. వారాంతంలో మాత్రం అంటే.. శుక్ర, శనివారాల్లో అర్థరాత్రి 1.00 గంట వరకు పబ్‌లు తెరచి ఉంచుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఖరి మార్చుకో వైఎస్ జగన్: ఎమ్మెల్యే యార్లగడ్డ
250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..
For More AP News And Telugu News