ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hidden Health Issues from Tight Clothing: గుప్త ప్రదేశంలో గూఢ సమస్యలు

ABN, Publish Date - Oct 14 , 2025 | 06:18 AM

కొన్ని అలవాట్లు గుప్త ప్రదేశాల్లో పలు రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులకు కారణమవుతూ ఉంటాయి. కటి దిగువ ప్రదేశంలో తలెత్తే అలాంటి కొన్ని సమస్యలు, నివారణోపాయాల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు...

ప్రొక్టాలజీ

కొన్ని అలవాట్లు గుప్త ప్రదేశాల్లో పలు రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులకు కారణమవుతూ ఉంటాయి. కటి దిగువ ప్రదేశంలో తలెత్తే అలాంటి కొన్ని సమస్యలు, నివారణోపాయాల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.

అందంగా కనిపించాలనే తాపత్రయంతో ఒంటిని అసౌకర్యానికి గురి చేసే బిగుతైన దుస్తులు, లోదుస్తులూ ధరించే అలవాటు కొందర్లో ఉంటుంది. అలాగే ఇంకొందరు బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యమిస్తారే తప్ప, దుస్తుల వెనక దాగి ఉండే శారీరక శుభ్రత పట్ల ఈశ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఇలాంటి అలవాట్లు, అశ్రద్ధలు అంతిమంగా ఆసన ఆరోగ్యాన్ని దెబ్బతీసే వ్యాధులకూ, ఇన్‌ఫెక్షన్లకూ దారి తీస్తూ ఉంటాయి.

అసలు సమస్య అలవాట్లతోనే...

ఆసనం... గాలి చొరబడే వీల్లేని గుప్త ప్రదేశం. అలాంటి ప్రదేశంలో సహజంగానే ఇన్‌ఫెక్షన్లు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా బిగుతైన దుస్తులు, లోదుస్తులు ధరించడం, చమట, అపరిశుభ్రత, అపరిశుభ్ర లోదుస్తులు.... ఇలా పలు కారణాల వల్ల ఆ ప్రాంతంలో రెట్టింపు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వాటిని విపులంగా చర్చించుకుంటే...

  • బిగుతైన జీన్స్‌ వేసుకునేవాళ్లు, అవే దుస్తుల్లో ఎక్కువ గంటలు పని చేసేవాళ్లలో ఆసన ప్రాంతంలో చమట పడుతూ ఉంటుంది. ఈ ప్రదేశాన్ని పొడిగా ఉంచుకోలేకపోవడం వల్ల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వేధించే ప్రమాదం ఉంటుంది

  • అవాంఛిత రోమాలు ఒక్కొకరిలో ఒక్కోలా ఉంటాయి. కొందర్లో త్వరగా, దట్టంగా పెరుగుతాయి. వీటికి చమట తోడై ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి.

  • కొందర్లో ఆసనం దగ్గర కూడా దట్టమైన వెంట్రుకలుంటాయి. ఇలాంటి వారికి కూడా అసౌకర్యాలు తప్పవు

  • లోదుస్తుల పరిశుభ్రత లోపించినా ఇన్‌ఫెక్షన్లు వేధిస్తాయి

  • కొందరు బిగుతైన దుస్తుల్లోనే నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటారు. ఇది కూడా సరి కాదు

ఆసనంలో తలెత్తే సమస్యలు ఇవే!

ఫాలిక్యులైటిస్‌: అవాంఛిత రోమాల మూలంగా చమట పట్టి, ‘ఫాలిక్యులైటిస్‌’ అనే సమస్య తలెత్తుతుంది. ఇది కాలక్రమేణా అల్సర్‌గా మారి చీము పడుతుంది

అజీర్తి: బిగుతైన జీన్స్‌తోనే నిద్రకు ఉపక్రమిస్తూ ఉండడం వల్ల, ఆ ఒత్తిడికి పొట్ట ఒత్తుకుపోయి, జీర్ణప్రక్రియ కూడా మందగిస్తూ ఉంటుంది

మలబద్ధకం: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే యానల్‌ కెనాల్‌ రిల్యాక్స్‌ అవుతుంది. కానీ రాత్రంతా బిగుతైన దుస్తుల్లో నిద్రపోవడం వల్ల ఆసనం రిల్యాక్స్‌ అవలేక, ఉదయం మలవిసర్జన జరగదు. దాంతో ఆఫీసుకు వెళ్లే హడాహుడిలో కాలకృత్యాలను వాయిదా వేసి, ఆ తర్వాత మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య అంతిమంగా మొలలు, ఫిషర్లకు దారి తీస్తుంది.

ఫిస్టులా: ఫిషర్లను నిర్లక్ష్యం చేయడం వల్ల అంతిమంగా పెరినియల్‌ యాబ్సె్‌సకు దారి తీస్తూ ఉంటుంది

ప్రొరైటస్‌ యానై: మలద్వారం చుట్టూరా దురద ఉంటుంది. దీనికి ఫిస్టులాలు, చమట, బిగుతైన లోదుస్తులు ప్రధాన కారణాలు

పిరుదుల మధ్య: బిగుతైన, గాలిచొరబడని, సింథటిక్‌ లోదుస్తుల వల్ల పిరుదుల మధ్య ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి

మలబద్ధకంతో...

మలబద్ధకం తలెత్తినప్పుడు, మలవిసర్జన సమయంలో ఒత్తిడిని ఉపయోగించడం మూలంగా మలద్వారం దగ్గర చీలిక ఏర్పడి ఫిషర్‌ ఏర్పడుతుంది. కోత ఏర్పనప్పుడు ఆ ప్రదేశంలోని చర్మం ముడుచుకుపోయి అతుక్కుపోతుంది. అలా ఆసనం దగ్గర పదే పదే ఫిషర్స్‌ ఏర్పడి, చర్మం అతుక్కుపోతూ ఉండడం వల్ల మలద్వారం బిగుతుగా మారిపోతుంది. దాంతో మలవిసర్జన సమయంలో మరింత ఒత్తిడిని ఉపయోగించవలసి వస్తుంది. ఫలితంగా మలద్వారం లోపల ఉండవలసిన పైల్స్‌ బయటకు జారతాయి. దీంతో మలద్వారం కుంచించుకుపోయి సమస్య మరింత జటిలమై, రక్తనాళాలు చిట్లి రక్తస్రావం, నొప్పి వేధిస్తాయి. దాంతో నొప్పిని తట్టుకోలేక మలవిసర్జనను పదే పదే వాయిదా వేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఫిషర్‌లో మలం నిల్వ ఉండిపోయి, అది పక్కకు ప్రయాణించి ఫిస్టులా ఏర్పడుతుంది. అలా వేరు మలద్వారం లోపల ఉండిపోయి, దాని కొమ్మలు ఆసనం చుట్టూరా ఏర్పడతాయి. వీటి నుంచి చీము స్రవిస్తూ ఉంటుంది. అయితే చాలా మంది వీటిని గమనించి, ఇది మలద్వారం దగ్గర కాకుండా పక్కన ఉంది కాబట్టి దీనికి మలద్వారంతో సంబంధం లేదనుకుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

అంతర్గతంగా ఆరోగ్యంగా లేనప్పుడు ఆ అసౌకర్యం, బాధ ముఖంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖాన్ని ఎంత ఆకర్షణీయంగా, పరిశుభ్రంగా ఉంచుకుంటామో, ఆసన ప్రాంతాన్ని కూడా అంతే ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందుకోసం ఈ జాగ్రత్తలు పాటించాలి

  • బిగుతైన జీన్స్‌ వాడకాన్ని పరిమితం చేయాలి. రాత్రుళ్లు అవే దుస్తుల్లో నిద్రకు ఉపక్రమించకూడదు

  • రాత్రివేళ గాలి ధారాళంగా వీచే దుస్తులు వేసుకోవాలి. రాత్రుళ్లు లోదుస్తులు ధరించకపోయినా ఫరవాలేదు

  • ముందు వైపు, ఆసనం చుట్టూరా ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకోవాలి

  • బిగుతైన లోదుస్తులకు స్వస్థి చెప్పాలి

  • సింథటిక్‌ బదులుగా చమటను పీల్చుకునే కాటన్‌ లోదుస్తులు ఎంచుకోవాలి

  • అండర్‌వేర్‌ పిరుదులకు సపోర్ట్‌ ఇచ్చేలా ఉండాలే తప్ప, బిగుతుగా ఉండకూడదు

  • ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా యాంటీ ఫంగల్‌ పౌడర్లు వాడుకోవచ్చు

  • నెలసరి సమయంలో ఉపయోగించే ప్యాడ్స్‌ తరచూ మారుస్తూ ఉండాలి

  • నాణ్యమైన, మన్నికైన శానిటరీ ప్యాడ్స్‌ వాడుకోవాలి

  • పొద్దున, రాత్రి రెండుసార్లు తప ్పనిసరిగా స్నానం చేయాలి

  • ఎదిగే వయసులో ఉన్న టీనేజర్ల లోదుస్తుల సైజుల పట్ల తల్లి ఓ కన్నేసి ఉంచి, తదనుగుణంగా మారుస్తూ ఉండాలి

  • బ్రాసరీలు, ప్యాంటీలు సాగిపోయి, వేలాడే పరిస్థితి తలెత్తేవరకూ వాటిని మార్చకుండా ఉండకూదు

  • నెలసరి తొలి రెండు రోజులూ శానిటరీ న్యాప్కిన్స్‌ రెండు నాలుగు గంటలకోసారి మార్చుకుంటూ, తర్వాత నుంచి ఉదయం, సాయంత్రం మార్చుకుంటూ ఉండాలి

  • వ్యాయామంలో భాగంగా బరువులు ఎత్తేటప్పుడు, మలద్వారం మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి పిరుదులకు చక్కని సపోర్ట్‌ ఇచ్చే లోదుస్తులు వేసుకోవాలి

డాక్టర్‌ శాంతి వర్ధని

సీనియర్‌ ప్రొక్టాలజిస్ట్‌,

లాప్రోస్కోపిక్‌ అండ్‌ కొలొరెక్టల్‌ సర్జన్‌,

యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌

బిగుతైన బ్రాసరీలతో...

బిగుతైన బ్రాసరీలు, వైరుతో కూడిన బ్రాసరీలతో రొమ్ముల దిగువన చర్మం ఒరుసుకుపోయి, అల్సర్లు, మొటిమలు ఏర్పడతాయి. అలాగే అక్కడ పేరుకునే చమట వల్ల సెబేషియస్‌ సిస్ట్‌లు తలెత్తుతాయి. రొమ్ములు గట్టిగా మారిపోతాయి లేదా రొమ్ముల్లో గడ్డలు ఏర్పడతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే సరైన కొలతలతో కూడిన కాటన్‌ బ్రాసరీలను ఎంచుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 06:18 AM