ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మంచి అలవాట్లు నేర్పించాలి

ABN, Publish Date - May 14 , 2025 | 03:40 AM

పోషకాహారంతోపాటు మంచి అలవాట్లు కూడా పిల్లల ఎదుగుదలకు, వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి. అందుకే తల్లితండ్రులు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి...

పేరెంటింగ్‌

పోషకాహారంతోపాటు మంచి అలవాట్లు కూడా పిల్లల ఎదుగుదలకు, వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి. అందుకే తల్లితండ్రులు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి.

  • పిల్లలను ఉదయాన్నే నిద్ర లేపి, తేలికపాటి వ్యాయామం చేయించాలి. దీనివల్ల శరీరమంతా రక్తప్రసరణ జరిగి మెదడుకి ఆక్సిజన్‌ బాగా అందుతుంది. పిల్లలు రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

  • వారానికి రెండు రోజులు యోగా చేయించాలి. దీనివల్ల శ్వాస మీద దృష్టి నిలుస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

  • రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగించాలి. దీనివల్ల నిర్జలీకరణ సమస్యలు రావు. మెదడు చురుకుగా పని చేస్తుంది. ఏకాగ్రత పెరిగి, జీర్ణాశయ సమస్యలు రావు.

  • ఉదయం పూట పిల్లలను కొద్దిసేపు చదివించాలి. ఈ సమయంలో మెదడు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చదివిన అంశాలు బాగా గుర్తుంటాయి.

  • అల్పాహారంలో పోషక విలువలు, పీచుపదార్థాలున్న ఆహారపదార్థాలను తినిపించాలి. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు.

  • పిల్లలకు చిన్న చిన్న లక్ష్యాలు సూచించి వాటిని త్వరగా పూర్తి చేయమని చెప్పాలి. ఉదాహరణకు ఒక పాఠాన్ని పూర్తిగా చదవడం, బొమ్మలు వేయడం, పుస్తకాలు సర్దడం లాంటివి చెప్పవచ్చు. పూర్తి చేసిన తరవాత అభినందిస్తే వాళ్లకి సాధించామన్న భావన కలిగి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి..

Operation Sindoor: ఎస్-400తో ప్రధాని మోదీ ... పాకిస్థాన్‌కు హెచ్చరిక సందేశం..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

Updated Date - May 14 , 2025 | 03:40 AM