Palleru Plant: పల్లేరుతో భేషైన ఆరోగ్యం..
ABN, Publish Date - May 10 , 2025 | 03:48 AM
పల్లేరు మొక్కను ఆయుర్వేదం ఎంతో శ్రేష్ఠమైన ఔషధంగా గుర్తించింది. దీని ఆకులు, కాయలు, వేర్లను వాడటం ద్వారా చర్మకాంతి, మూత్రపిండాల ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత వంటి అనేక లాభాలు పొందవచ్చు.
పల్లేరు మనకు చాలా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది దీన్ని పిచ్చి మొక్క అనుకుంటారు. కానీ పల్లేరు కాయలు, ఆకుల వల్ల అమితమైన ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి.
పల్లేరును సంస్కృతంలో ‘గోక్షురం’ అని పిలుస్తారు. ‘గోక్షురం’ అంటే శరీరానికి చల్లదనాన్ని, బలాన్ని, పుష్టిని అందించేదని అర్ధం. పల్లేరుకాయలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. పెద్ద పల్లేరుకాయల్ని ‘గజపల్లేరు’ అంటారు. ఈ కాయను రెండుగా చీలిస్తే- లోపల భాగమంతా జిగురుగా ఉంటుంది. ఈ జిగురు మన శరీరానికి ఎంతో ఉపకరిస్తుంది. కేవలం జిగురు మాత్రమే కాదు, పల్లేరు ఆకులు, కాయలు, వేర్లు... ఇవన్నీ త్రిదోష సమతుల్యతను కలిగిస్తాయి. చిన్న పల్లేరు కాయలకు కూడా ఈ తరహా గుణాలే ఉంటాయి. పల్లేరు కాయలు, ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
పల్లేరు ఆకులను ఎండబెట్టి వాటితో ఉదయాన్నే టీ చేసుకొని తాగితే చర్మానికి కాంతి వస్తుంది.
పల్లేరు ఆకులను సలాడ్‌లో వేసుకొని తింటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రనాళంలోని రాళ్లు కరిగిపోతాయి.
పల్లేరు కాయలను ఎండబెట్టి కషాయంగా చేసి తాగితే హార్మోన్ల అసమతౌల్యం కలిగే రకరకాల సమస్యలు తగ్గుతాయి. యువతులను వేధించే ‘పోలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్’ (పీసీఓడీ)కు కూడా ఇది మంచి పరిష్కారం.
పల్లేరు కాయలు స్ఫటికం మాదిరిగా ముళ్లు ముళ్లుగా ఉంటాయి. ఈ కాయలలోని గుజ్జును ఏదో ఒక రూపంలో తీసుకుంటే మూత్రపిండాల్లో పేరుకున్న రాళ్లు కరుగుతాయి.
పల్లేరు ఆకులు, కాయలు, వేర్లను ఎండబెట్టి...
పొడి చేసి దాన్ని కూరల్లో వాడుకుంటే రకరకాల ప్రయోజనాలు ఉంటాయి.
-గంగరాజు అరుణాదేవి
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 10 , 2025 | 03:48 AM