ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Grazing Tables Hyderabad: కళ్లకూ రుచి చూపిస్తున్నారు

ABN, Publish Date - Sep 11 , 2025 | 02:50 AM

ఇంటికి స్నేహితులు.. బంధువులు వస్తే వారు మెచ్చుకొనేలా లంచ్‌, డిన్నర్‌ పెట్టాలని చాలామందికి ఉంటుంది. దీనికి ఉన్న ఒక పరిష్కారం కేటరింగ్‌. మనం ముందే ఆర్డర్‌ ఇస్తే సమయానికి వారు వంటలు తెచ్చి ఇస్తారు..

ఇంటికి స్నేహితులు.. బంధువులు వస్తే వారు మెచ్చుకొనేలా లంచ్‌, డిన్నర్‌ పెట్టాలని చాలామందికి ఉంటుంది. దీనికి ఉన్న ఒక పరిష్కారం కేటరింగ్‌. మనం ముందే ఆర్డర్‌ ఇస్తే సమయానికి వారు వంటలు తెచ్చి ఇస్తారు.. వాటిని మనం సర్వ్‌ చేసుకోవాలి. అయితే ఈ మధ్య హైదరాబాద్‌ లాంటి నగరాల్లో ‘గ్రేజింగ్‌ టేబుల్స్‌’ అనే కొత్త ఒరవడి ప్రారంభమయింది. మనకు నచ్చిన ఆహారంతో పాటు కంటికి ఆహ్లాదంగా కనిపించే పూలతో అలంకరణలు కూడా ఇందులో ఉంటాయి. హైదరాబాద్‌లో దీన్ని ప్రవేశపెట్టిన వారిలో ఒకరైన రోషణి ‘కిచెన్‌ టేబుల్‌’ అనే సంస్థను ప్రారంభించారు. ఆమెను ‘నవ్య’ పలకరించినప్పుడు చెప్పిన విశేషాలివి.

‘‘నేను రెండున్నర దశాబ్దాలుగా ఆతిథ్య రంగంలో ఉన్నాను. అనేక హోటల్స్‌లో పనిచేశాను. కానీ ఎప్పుడూ కిచెన్‌లో చెఫ్‌గా పనిచేయలేదు. ఇప్పుడు అదే నా వృత్తి కావటం యాదృచ్ఛికమనే చెప్పాలి. కొవిడ్‌ సమయంలో అందరం ఇళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఒక విధమైన అనిశ్చితి నెలకొంది. ఆ సమయంలో ఒక బిజినె్‌సను ప్రారంభిస్తే బావుంటుందనుకున్నా. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొవిడ్‌ వల్ల అనేక వృత్తుల్లో రకరకాల మార్పులు వచ్చాయి. అతిఽథ్య రంగం పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. అంతేకాకుండా నాకంటూ ప్రత్యేకమైన బిజినెస్‌ ఉంటే- ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చు. ఈ రెండిటినీ దృష్టిలో ఉంచుకొని ‘హోమ్‌ కిచెన్‌’ను ప్రారంభించి చిన్న చిన్న ఆర్డర్లు తీసుకొని ఆహారాన్ని అందించేదాన్ని. నేను మొదలుపెట్టినప్పుడు నాకు పెద్దగా వంట రాదు. నా భర్త ఎరోల్‌ నాథన్‌ నాకు సాయపడ్డారు. ఆహారం రుచికరంగా ఉండటంతో ఆర్డర్ల సంఖ్య పెరిగింది. తరువాత ఎరోల్‌ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు సాయం చేయటం మొదలుపెట్టారు.

ఇలా మొదలైంది!

హైదరాబాద్‌లో వంటలు వండి అందించే అనేక హోమ్‌ కిచెన్స్‌ ఉన్నాయి. వాటికి మాకు తేడా ఏదో ఒకటి ఉండాలి కదా! దానిగురించి మేము ఆలోచించాం. నేను, నా భర్త ఆతిథ్య రంగంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో పనిచేశాం. ఎక్కువ కాలం గోవాలో కూడా ఉన్నాం. కాబట్టి మొదట్లో గోవాకు చెందిన రకరకాల వంటలను వండి అందించే వాళ్లం. అంతేకాకుండా నా భర్త ఆంగ్లో ఇండియన్‌. నేను బెంగాలీ. అందువల్ల మేము ఆ రెండు రకాల మెనూలను తయారుచేశాం. ఆ సమయంలోనే నేను తొలిసారి ప్లేటర్స్‌ (రకరకాల ఆహారపదార్థాలను ఒక పెద్ద ప్లేటులో పెట్టి అందించటం)ను రూపొందించాను. వాటన్నిటికీ మంచి స్పందన వచ్చింది. ప్లేటర్స్‌కు మంచి డిమాండ్‌ ఉందని తేలింది. దాంతో మేము పెద్ద పెద్ద స్టోర్స్‌ ప్రారంభోత్సవాలకు, ధనికుల ఇళ్లలో పార్టీలకు ప్లేటర్స్‌ను అందించటం మొదలుపెట్టాం. ఇలా మా ‘ఫుడ్‌ టేబుల్‌’ ప్రారంభమయింది.

తేడా ఇదే!

మనం ఆహారం తినేటప్పుడు.. మన కళ్లు, ముక్కు, నోరు సమన్వయంతో పనిచేస్తాయి. రుచికరమైన ఆహారం నుంచి వచ్చే వాసనను ముక్కు పసిగడుతుంది. నాలుక రుచి ఎలా ఉందో చెబుతుంది. కానీ చాలా సందర్భాలలో వంటలు కంటికి ఇంపుగా కనిపించాలనే విషయాన్ని ఎక్కువ మంది పట్టించుకోరు. కానీ పెద్ద పెద్ద హోటల్స్‌లో అందంగా ఆహారాన్ని అమర్చటానికి (ప్లేటింగ్‌) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆహారంతో పాటుగా చుట్టూ పూలతో అలంకరణ చేస్తే... వాటిని చూసినప్పుడు మనసుకు కూడా హాయిగా ఉంటుంది. ఈ రెండు విషయాలను పరిగణనలోకి తీసుకొని ‘గ్రేజింగ్‌ టేబుల్స్‌’ను రూపొందించటం మొదలుపెట్టాం.

చాలామంది మామూలు కేటరింగ్‌కు, గ్రేజింగ్‌ టేబుల్స్‌ తయారీకి తేడా ఏమిటని అడుగుతూ ఉంటారు. మామూలు కేటరింగ్‌లో ఆహార పదార్థాలను అమరుస్తారు. రుచిపైనే ఎక్కువ దృష్టి పెడతారు. గ్రేజింగ్‌ టేబుల్స్‌ విషయానికి వచ్చే సరికి - ఆహారంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అందంగా డెకరేట్‌ చేయటంపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా గ్రేజింగ్‌ టేబుల్స్‌లో అమర్చే ఆహార పదార్థాల పరిమాణం చిన్నగా ఉంటుంది. ఉదాహరణకు సమోసాలను తీసుకుంటే- గ్రేజింగ్‌ టేబుల్స్‌లో పెట్టే సమోసాలు చిన్నవిగా ఉంటాయి. వాటిని అందంగా అలంకరిస్తారు. అమర్చే తీరు కూడా వేరుగా ఉంటుంది. ఈ టేబుల్స్‌ను సాధారణంగా వేర్వేరు థీమ్‌ల ఆధారంగా అమరుస్తూ ఉంటాం. వీటిలో లేబనీస్‌ ప్లేటర్‌, ఇటాలియన్‌ ప్లేటర్‌, చీజ్‌ ప్లేటర్‌ లాంటి వాటికి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. స్నేహితుల పుట్టిన రోజులకు బహుమతిగా పంపించేవారు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో పుట్టిన రోజులకు, వివాహ వార్షికోత్సవాలకు, పండుగలకు ఫుడ్‌ ప్లేటర్స్‌ను పంపించటం బాగా పెరిగింది.

సవాళ్లు కూడా..

ప్రతి గ్రేజింగ్‌ టేబుల్‌ను అమర్చటానికి రెండు నుంచి మూడు గంటలు పడుతుంది. వాటిని అలంకరించాలంటే ఆరు గంటల దాకా పడుతుంది. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. ఎంతమందికి వంట వండాల్సి వచ్చినా నేనే స్వయంగా వండుతాను. చెఫ్‌లను పెట్టుకోను. నా భర్త, కొందరు సహాయకులతో పని చేస్తాను. అందుకే అందరూ నా వంటను మెచ్చుకుంటారు.

ఫ సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

ఈ మధ్యకాలంలో రకరకాల కూరగాయలను, పండ్లను డెకరేషన్‌గా కూడా వాడటం మొదలుపెట్టారు. వాటిని పూలతో పాటుగా వాడుతున్నారు.

మా అబ్బాయి రుహాన్‌కు నా వంట అంటే చాలా ఇష్టం. నన్ను చూసి తను కూడా ఈ రంగంలోకే రావాలనుకున్నాడు. హోటల్‌ మేనేజిమెంట్‌ కాలేజీలో చేరాడు. అయితే దురదృష్టం తనని వెంటాడింది.

గత ఏడాది యాక్సిడెంట్‌ కావటంతో తను కోమాలోకి వెళ్లిపోయాడు. ఇప్పటి దాకా తనకు ఏడు సర్జరీలు జరిగాయి. ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాడు. నేను, నా భర్త - మాలో ఎవరో ఒకరు తనకు తోడుగా ఉండాలి. అందుకే ముఖ్యమైన ఈవెంట్స్‌ను మాత్రమే చేస్తున్నాను.

ఈ వార్తలు కూడా చదవండి..

పూర్వ జన్మ సుకృతం.. అందుకే..

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..

Updated Date - Sep 11 , 2025 | 02:51 AM