Deepika Padukone Makeup: దీపికలా దేదీప్యంగా
ABN, Publish Date - Aug 25 , 2025 | 01:08 AM
మేకప్ ముఖం మీద సమంగా పరుచుకోవాలన్నా, ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉండాలన్నా ముఖం శుభ్రంగా ఉండాలి. కాబట్టి ముఖాన్ని సబ్బుతో కడిగి నునుపుదనం కోసం, మెరిసే బేస్ కోసం...
మేకప్
బాలీవుడ్ నటి దీపికా పడుకొనె కాటుక కళ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకోసం ఆమె అనుసరించే మేకప్ చిట్కాలను తెలుసుకుందాం!
మేకప్ ముఖం మీద సమంగా పరుచుకోవాలన్నా, ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉండాలన్నా ముఖం శుభ్రంగా ఉండాలి. కాబట్టి ముఖాన్ని సబ్బుతో కడిగి నునుపుదనం కోసం, మెరిసే బేస్ కోసం హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ పూసుకోవాలి. ఆ తర్వాత మేకప్ నిలిచి ఉండేలా ప్రైమర్‌ను అప్లై చేసుకోవాలి.
చర్మపు ఛాయను మెరుగుపరిచేలా లైట్‌వెయిట్ ఫౌండేషన్‌ను ఎంచుకుని, నీళ్లలో తడిపి పిండిన స్పాంజ్‌తో ఫౌండేషన్‌ను ముఖం మీద అద్దుకోవాలి.
కళ్ల దిగువన కన్‌సీలర్‌ను పూసుకుని, మచ్చలు చర్మంలో కలిసిపోయేలా సరి చేసుకోవాలి
కనురెప్పలకు షిమ్మరింగ్ గోల్డ్ ఐల్యాషెస్ పెట్టుకోవాలి. కోల్ పెన్సిల్‌తో పైన, కింద కనురెప్పలను దిద్దుకోవాలి. తర్వాత వాల్యుమైజింగ్ మస్కారాతో కనురెప్పలను ఒత్తుగా మలుచుకోవాలి
మెత్తని కాంటూర్ పౌడర్ లేదా క్రీమ్‌తో చెక్కిళ్ల ఎముకలు, దవడ ఎముకలు, నుదురులను చక్కని ఆకృతిలో మలుచుకోవాలి
ఎత్తైన ప్రదేశాలైన కాలర్‌బోన్స్, ముక్కుల పైన హైలైటర్ అద్దుకోవాలి
కనుబొమలను బ్రష్ చేసి, ఖాళీ జాగాల్లో బ్రో పెన్సిల్‌తో దిద్దుకోవాలి. క్లియర్ లేదా టింటెడ్ బ్రో జెల్ అద్దుకోవాలి
న్యూడ్ లేదా మావ్ లిప్ లైనర్‌తో పెదవులకు ఆకృతినివ్వాలి. తర్వాత గ్లాసీ మావ్ లిప్‌స్టిక్‌ను అప్లై చేసి పెదవులను అందంగా తీర్చిదిద్దుకోవాలి
చివర్లో, సెట్టింగ్ స్ర్పేతో మేకప్‌ను చెక్కుచెదరకుండా లాక్ చేసేయాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే అందానికి అందం సమకూరడంతో పాటు దీర్ఘకాలం పాటు చెక్కుచెదరని మేకప్ మీ సొంతమవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News
Updated Date - Aug 25 , 2025 | 01:08 AM