Chaitra: క్లిష్టమైనా అలవోకగా
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:41 AM
చైత్ర శివవాసుకి కాకినాడ జగన్నాధపురం సెయింట్‌ఆన్స్ గర్ల్స్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. తండ్రి వెంకటకుమార్ ప్లంబ్లింగ్ పని చేస్తుంటారు.
చైత్ర శివవాసుకి కాకినాడ జగన్నాధపురం సెయింట్‌ఆన్స్ గర్ల్స్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. తండ్రి వెంకటకుమార్ ప్లంబ్లింగ్ పని చేస్తుంటారు. తల్లి ధనలక్ష్మి ప్రైవేటు పాఠశాలలో పీఈటీ. చిన్నప్పుడు ఆస్తమాతో ఇబ్బంది పడిన చైత్రకు ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉండేది. దీని నుంచి బయటపడేందుకు యోగా సాధన మొదలుపెట్టింది. ఇప్పుడు ఎంత క్లిష్టమైన ఆసనాలైనా అలవోకగా చేసేస్తుంది. నిత్యం యోగావల్ల తన ఆస్తమా సమస్య దూరం అయిందని, ప్రస్తుతం తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాని చెబుతోంది చైత్ర.
గత ఏడాది చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యోగాసన పోటీల్లో రెండో స్థానంలో నిలిచి అబ్బురపరిచింది. రాష్ట్ర, జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో పలు పతకాలు సొంతం చేసుకుంది. యోగా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందంటున్న చైత్ర అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో దూసుకుపోతోంది.
పీవీవీ వరప్రసాద్, సిల్లి కుమార్, కాకినాడ
Updated Date - Jun 21 , 2025 | 12:41 AM