Hostel Preparation Guide: పిల్లలను హాస్టల్‌కు పంపే ముందు
ABN, Publish Date - Apr 24 , 2025 | 12:01 AM
పిల్లలను హాస్టల్‌కు పంపే ముందు, వారిలో క్రమశిక్షణ, స్వయంప్రమేయత, మరియు జాగ్రత్తలతో జీవించే అలవాట్లను పెంపొందించాలి. స్వీయ నిర్వహణ, ఆత్మవిశ్వాసం, ఇతరులతో కలిసిమెలిసి ఉండటం నేర్పించడం చాలా ముఖ్యం.
ఒక్కోసారి పిల్లలను చదువు నిమిత్తం పాఠశాల స్థాయిలోనే హాస్టల్‌కి పంపాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు ముందుగానే పిల్లలకు కొన్ని విషయాలను నేర్పించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలకు బాధ్యతగా వ్యవహరించడం నేర్పించాలి. చిన్న చిన్న పనులు చెప్పి చేయిస్తూ ఉంటే వాళ్లకి పనులు చేయడం అలవాటు అవుతుంది.
సమయానుసారం దినచర్య, వ్యాయామం పూర్తిచేసేలా అలవాటు చేయాలి. క్రమశిక్షణతో ఉండడం నేర్పించాలి.
పుస్తకాలు సహా దుస్తులు, ఇతర వస్తువులను భద్రపరచుకునే విధానాలు తెలియజెప్పాలి.
పిల్లలు కొత్త చోట ఉండడానికి భయపడుతూ ఉంటారు. అలాకాకుండా వారిని వెన్నంటి ప్రోత్సహిస్తే ఎప్పటికప్పుడు ఎలాంటి పరిస్థితులతోనైనా సర్దుకుపోవడాన్ని అలవాటు చేసుకుంటారు.
పిల్లలకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎలానో నేర్పించాలి. ఏ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియజెప్పాలి. దీంతో వాళ్లు ఎక్కడైనా ధైర్యంగా ఉండగల్గుతారు.
అనుకోకుండా ఏదైనా పొరబాటు జరిగితే దాని నుంచి పాఠం నేర్చుకోవడం ఎలానో వివరించి చెప్పాలి.
ఇతరులను గౌరవించడం, స్నేహపూర్వకంగా మాట్లాడడం, సంయమనంతో మెలగడం లాంటివి నేర్పించాలి.
పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవడం, ఇచ్చిపుచ్చుకునే విధానాల గురించి వివరించాలి.
బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ నిర్ణీత సమయంలో హోమ్‌వర్క్‌లు పూర్తి చేయడాన్ని అలవాటు చేయాలి.
చిన్న చిన్న ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తూ వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజెప్పాలి.
ఆహారం తీసుకోవడం, ఆటలు ఆడడం, చదువుకోవడం, వ్యక్తిగత శుభ్రత లాంటివి పాటించడంలో నిర్లక్ష్యం వహించకూడదని పిల్లలకు వివరించాలి.
ఇవి కూడా చదవండి..
Pahalgam Terror Attack: ఉగ్ర 'వేట' మైదలైంది... జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
Pahalgam Terror Attack: జనసేన మూడు రోజుల సంతాప దినాలు.. జెండాల అవనతం
Pahalgam Terror Attack: ఉగ్రవాదులతో పోరాడిన ఒక్కే ఒక్కడు
Pahalgam Attack: భార్యాపిల్లల కళ్లముందే ఐబీ అధికారిని కాల్చిచంపారు
Updated Date - Apr 24 , 2025 | 12:01 AM