మొటిమలకు ఎలక్ట్రిక్ ప్యాచ్..
ABN, Publish Date - May 25 , 2025 | 12:10 PM
అమ్మాయిలకు ముఖం మీద మొటిమల పట్ల చాలా భయం ఉంటుంది. ఉదయం నిద్రలేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే... ఒక్క మొటిమ కనిపించినా చాలు ఇబ్బందిగా ఫీలవుతారు. వాటి కోసం రకరకాల క్రీములు వాడుతుంటారు. మొండి మొటిమలతో కుస్తీ పట్టేవాళ్లు బ్యూటీపార్లర్లకు, స్కిన్ స్పెషలిస్టులను సంప్రదిస్తుంటారు. కొందరు ఎలక్ట్రిక్ థెరపీ వైపు మొగ్గుచూపుతారు.
పాదాల ఆనెలకు పట్టీలు ఉన్నట్టే... మొటిమలకు కూడా ‘ఎలక్ట్రిక్ ఆక్నే ప్యాచెస్’ మార్కెట్లోకి వచ్చేశాయి. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌లో వీటికోసం వెదుకుతున్న అమ్మాయిల సంఖ్య అధికమవుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. లెడ్ లైట్లతో (నీలి, ఎరుపు) ఉండే ఈ ప్యాచ్‌లను మొటిమ ఉన్న చోట అతికించాలి. అందులోని కాంతి మొటిమ ఏర్పడడానికి కారణమైన బ్యాక్టీరియాను చంపడమే గాక, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, మొటిమ ఉన్న భాగం త్వరగా హీల్ అయ్యేలా చేస్తుందట. వీటిలో బ్యాటరీ 6 గంటల నుంచి 8 గంటల దాకా వెలుతురు ప్రసరించేందుకు తోడ్పడతాయి. అయితే ఈ ప్యాచ్‌ను 5 నుంచి 20 నిమిషాల పాటు అతికిస్తే సరిపోతుంది.
సోషల్ మీడియాలో కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్స్ మాత్రం వీటిని రాత్రంతా (8 గంటలపాటు) పెట్టుకుంటున్నట్లు చూపిస్తున్నారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో 6 ఎలక్ట్రిక్ ప్యాచ్‌లున్న ప్యాక్ ధర సుమారు రూ. 1500. కొరియన్ స్కిన్‌కేర్‌లో ఎప్పటి నుంచో ఉన్న ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మనదగ్గర కూడా ప్రచారంలోకి వస్తోంది. కానీ వీటిపట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా లేకపోతే చర్మం మాడిపోయి, మరిన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని చర్మనిపుణులు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి
Hyderabad Metro: పార్ట్-బీ మెట్రోకు డీపీఆర్ సిద్ధం
Read Latest Telangana News and National News
Updated Date - May 25 , 2025 | 12:10 PM