Cold Remedies: జలుబు సమస్యల నివారణకు
ABN, Publish Date - Sep 01 , 2025 | 02:55 AM
వర్షాకాలంలో సాధారణంగా జలుబు, దగ్గు, తలనొప్పిలాంటి సమస్యలు వేధిస్తుంటాయి. వీటినుంచి తప్పించుకోవడానికి రోజూ ఏ ఆహారపదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
వర్షాకాలంలో సాధారణంగా జలుబు, దగ్గు, తలనొప్పిలాంటి సమస్యలు వేధిస్తుంటాయి. వీటినుంచి తప్పించుకోవడానికి రోజూ ఏ ఆహారపదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం..!
అల్లం ముక్కలు లేదా అల్లం రసాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తి లభిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు... వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాన్ని నివారిస్తాయి.
ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు లేదా పావు చెంచా మిరియాల పొడి కలుపుకుని తాగితే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలను తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్, కాల్షియం లాంటి పోషకాలతోపాటు ఎ, బి, సి, కె విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి నీరసాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
టమాటా, బీన్స్, పప్పు దినుసులతో తయారుచేసిన సూప్‌లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవడంతోపాటు తలనొప్పి, కండరాల నొప్పి తగ్గుతాయి.
వర్షాకాలంలో తరచూ బాదం పప్పులు, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
తులసి, పుదీనా, నిమ్మగడ్డితో తయారుచేసిన పానీయాలను వేడివేడిగా తాగుతూ ఉంటే గొంతులో ఏర్పడే కఫ సమస్యలు, ముక్కు దిబ్బడ తగ్గుతాయి.
ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా వాము, చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడబోసి రోజుకు రెండుసార్లు తాగితే జలుబు, దగ్గు, తుమ్ములు తగ్గిపోతాయి. అరచెంచా వాము పొడిలో ఒక చెంచా తేనె కలిపి రాత్రి పడుకునేముందు తీసుకుంటే రెండు రోజుల్లో గొంతునొప్పి తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి
హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది.. మంత్రి ఉత్తమ్‌పై హరీష్‌రావు ఫైర్
Updated Date - Sep 01 , 2025 | 02:55 AM