Kitchen Cleaning: ఇలా చేస్తే జిడ్డు మరకలు మాయం
ABN, Publish Date - Oct 08 , 2025 | 01:15 AM
వంటగదిలో తరచూ జిడ్డు మరకలు ఏర్పడుతూ ఉంటాయి. వంట చేసేటప్పుడు స్టవ్ మీద, దాని వెనక గోడపై నూనె చింది జిడ్డు పేరుకుంటూ ఉంటంది. చిన్న చిట్కాలతో ఈ జిడ్డు మరకలను..
వంటగదిలో తరచూ జిడ్డు మరకలు ఏర్పడుతూ ఉంటాయి. వంట చేసేటప్పుడు స్టవ్ మీద, దాని వెనక గోడపై నూనె చింది జిడ్డు పేరుకుంటూ ఉంటంది. చిన్న చిట్కాలతో ఈ జిడ్డు మరకలను ఎలా మాయం చేయాలో తెలుసుకుందాం...
ఒక గిన్నెలో రెండు చెంచాల కాఫీ పొడి, రెండు చెంచాల డిష్‌వాష్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జిడ్డు మరకల మీద రాసి పది నిమిషాలు నాననివ్వాలి. తరువాత నీళ్లు పోసి కడిగేస్తే జిడ్డు తొలగిపోతుంది.
జిడ్డు పేరుకున్న చోట కొద్దిగా ఉప్పు లేదా కార్న్‌ఫ్లోర్ చల్లి అరగంట తరువాత పలుచని గుడ్డతో తుడిచేస్తే ఫలితం కనిపిస్తుంది.
జిడ్డు మరకలపై బియ్యం కడిగిన నీళ్లు చల్లి బ్రష్‌తో రుద్ది ఆపైన మంచినీళ్లతో కడిగేస్తే చాలు... జిడ్డు పూర్తిగా వదులుతుంది.
అరగ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా డిష్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జిడ్డు పేరుకున్న ప్రాంతంలో చల్లి, పావు గంట తరువాత పాత గుడ్డతో తుడిచేస్తే మరకలన్నీ మాయమవుతాయి.
ఒక పాత బాటిల్‌లో వైట్ వెనిగర్, నీటిని సమభాగాలుగా తీసుకుని బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని జిడ్డు మరకల మీద పిచికారీ చేసి పది నిమిషాల తరువాత స్పాంజ్‌తో తుడిచేస్తే సరిపోతుంది.
నిమ్మచెక్క మీద కొద్దిగా ఉప్పు వేసి దాంతో గట్టిగా రుద్దితే తేలికపాటి జిడ్డు మరకలు వదిలిపోతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 08 , 2025 | 01:15 AM