ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Handbag Cleaning Tips: హ్యాండ్‌ బ్యాగ్‌ మెరిసేలా

ABN, Publish Date - Dec 18 , 2025 | 12:33 AM

రోజూ వినియోగించే హ్యాండ్‌ బ్యాగ్‌ల మీద ఎక్కువగా దుమ్ము, ధూళి చేరుతుంటాయి. మరకలు ఏర్పడుతుంటాయి. ఇలా అందవిహీనంగా మారిన హ్యాండ్‌ బ్యాగ్‌లను...

రోజూ వినియోగించే హ్యాండ్‌ బ్యాగ్‌ల మీద ఎక్కువగా దుమ్ము, ధూళి చేరుతుంటాయి. మరకలు ఏర్పడుతుంటాయి. ఇలా అందవిహీనంగా మారిన హ్యాండ్‌ బ్యాగ్‌లను కొత్త వాటిలా మెరిపించే చిట్కాలివే.

  • పెద్ద గిన్నెలో గ్లాసు వేడినీళ్లు పోసి అందులో చెంచా లిక్విడ్‌ డిటర్జెంట్‌, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. అందులో ఒక దూది ఉండను ముంచి దానితో హ్యాండ్‌ బాగ్‌ను తుడవాలి. చాలావరకు మురికి, మరకలు తొలగిపోతాయి.

  • హ్యాండ్‌ బ్యాగ్‌ల మీద తరచూ పెన్ను గీతలు, సిరా మరకలు పడుతుంటాయి. పలుచని చేతి రుమాలుమీద కొద్దిగా శానిటైజర్‌ లేదా ఆల్కహాల్‌ వేసి బ్యాగ్‌ను తుడిస్తే ఈ మరకలు పూర్తిగా పోతాయి.

  • ఎండ ఎక్కువగా తగలడంవల్ల బ్యాగ్‌ తేమను కోల్పోయి పెళుసుగా మారుతుంది. అలాంటప్పుడు చిన్న గిన్నెలో చెంచా అవిసె నూనె, రెండు చెంచాల వెనిగర్‌ వేసి కలిపిన మిశ్రమాన్ని చిన్న దూది ఉండతో అద్ది బ్యాగ్‌ మొత్తాన్ని తుడవాలి. పది నిమిషాల తరువాత పొడి గుడ్డతో తుడిచేస్తే బ్యాగ్‌ మృదువుగా మారి మెరుస్తుంది.

  • లంచ్‌ బాక్స్‌లో తీసుకెళ్లే ఆహార పదార్ధాల వల్ల కూడా హ్యాండ్‌ బ్యాగ్‌ మీద నూనె, జిడ్డు లాంటి మొండి మరకలు ఏర్పడుతుంటాయి. వీటి మీద కొద్దిగా బేకింగ్‌ సోడా, కార్న్‌ఫ్లోర్‌ చల్లి పలుచని చేతి రుమాలు లేదా పాత తువాలుతో తుడిస్తే ఫలితం కనిపిస్తుంది.

ఇవీ చదవండి:

Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్

పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం

Updated Date - Dec 18 , 2025 | 12:33 AM