Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:30 PM
నిన్న(మంగళవారం) ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఈ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చేరారు. దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టు అతడిని రూ. 75 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పెస్ట్ షేర్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: అబుదాబీ వేదికగా నిన్న(మంగళవారం) ఐపీఎల్(IPL 2026) మినీ వేలం జరిగింది. ఈ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చేరారు. దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టు అతడిని రూ. 75 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. మంగళవారం వేలానికి కొన్ని గంటల ముందు సర్ఫరాజ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. ఇక వేలంలో తొలి రౌండ్‌లో అమ్ముడుపోకపోయినప్పటికీ, చివరికి సీఎస్‌కే అతడిని కొనుగోలు చేసింది. ఆ జట్టు వేలంలో ఆరో ఆటగాడిగా సర్ఫరాజ్(Sarfaraz Khan)ను తీసుకుంది.
దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనుండటంతో సర్ఫరాజ్(Sarfaraz Khan) సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.'నాకు కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు సీఎస్‌కేకు చాలా చాలా ధన్యవాదాలు' అని సర్ఫరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఐపీఎల్ 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు రూ. 75 లక్షలకు అమ్ముడుపోయిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ పెట్టిన ఈ భావోద్వేగభరితమైన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది. సర్ఫరాజ్ ఖాన్ చివరిసారిగా 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy)లో ఆరు ఇన్నింగ్స్‌లలో 64.00 సగటుతో మరియు 182.85 స్ట్రైక్-రేట్‌తో 256 పరుగులు సాధించాడు.
ఇవీ చదవండి:
వచ్చేస్తోంది భారత్ 'ట్యాక్సీ'.. ఇక డ్రైవర్లకు, వినియోగదారులకు...
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం