Indian Railway: షాక్ ఇచ్చిన రైల్వే శాఖ.. జనరల్ బోగీ ప్రయాణికులను వదల్లా..
ABN , Publish Date - Dec 17 , 2025 | 07:10 PM
పండగ ముందు ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో ప్రయాణించే ప్రయాణికుడి నుంచి జనరల్ బోగీలో ప్రయాణించే ప్రయాణికుడి వరకు ఎవరిని వదిలి పెట్టలేదీ రైల్వే శాఖ
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకా చెప్పాలంటే.. ప్రయాణికులకు గట్టి షాక్ ఇచ్చింది. ఇకపై రైళ్లలో ప్రయాణికులు అధిక లగేజీ తీసుకు వెళ్లితే.. పన్ను విధించాలని నిర్ణయించింది. లగేజీ బరువు పరిమితి తాటితే అదనపు ఛార్జీలు విధించాలని నిర్ణయించింది.
ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారికి 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఏసీ టూటైర్‌లో 50 కిలోల వరకు.. ఏసీ త్రీటైర్‌లో 40 కేజీల వరకు లగేజీ తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఇక జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి కేవలం 35 కిలోల లగేజీ తీసుకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది.
10 గంటల ముందే..
రైల్వే ప్రయాణం అత్యంత చౌక అయినది. అందుకే రైళ్లలో ప్రయాణించేందుకు అంతా మొగ్గు చూపుతారు. జనరల్ టికెట్లే కాదు.. రిజర్వేషన్‌లో కలిపి టికెట్ ధర కూడా స్వల్పంగానే ఉంటుంది. బస్సు ధరతో పోలిస్తే.. రైలు ప్రయాణం చౌక ప్లస్ సౌకర్యవంతమైదన్నది సుస్పష్టం. అయితే టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే.. అది కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే.. ప్రయాణికుడు ఒకింత టెన్షన్ పడతాడు. ఇది అందరికి వర్తిస్తోంది. ఈ టెన్షన్ నుంచి ప్రయాణికుడిని బయట పడేసేందుకు రైల్వే శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం రైలు బయలుదేరడానికి కేవలం 4 గంటల ముందు రిజర్వేషన్ చార్జ్‌ను సిద్ధం చేస్తోంది. ఇకపై రైలు బయలుదేరడానికి దాదాపు 10 గంటల ముందుగానే చార్జ్ ప్రిపేరు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన చార్జ్ ప్రిపరేషన్ షెడ్యూల్‌ను రైల్వే బోర్డు అప్‌డేట్ చేసింది. దీంతో దాదాపు 10 గంటల ముందు టికెట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
ఇంకా సోదాహరణగా చెప్పాలంటే..
ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బయలుదేరే రైళ్లకు తొలి చార్జ్‌ను ముందు రోజు రాత్రి 8 గంటలకల్లా రూపొందిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12.00 గంటల వరకు.. అర్థరాత్రి 12.00 గంటల నుంచి ఉదయం 5.00 గంటల వరకు బయల్దేరే రైళ్ల చార్జ్‌ను కనీసం 10 గంటల ముందు రూపొందించాలని రైల్వే బోర్డు వివరించింది. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపట్టాలని ఇప్పటికే దేశంలోని అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వే బోర్డు లేఖ రాసింది.