Share News

AP High Court: మావో అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై హై‌కోర్టులో పిల్..

ABN , Publish Date - Dec 17 , 2025 | 06:38 PM

ఇటీవల మరణించిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరో ఐదుగురు ఎన్‌కౌంటర్ ఘటనపై హై‌కోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం (PIL) దాఖలవ్వడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

AP High Court: మావో అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై హై‌కోర్టులో పిల్..
Hidma Encounter Pill

మావోయిస్టు అగ్ర నేత హిడ్మా (Hidma) మరణం ఒక సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. అయితే.. హిడ్మాతోపాటు ఇతరుల ఎన్‌కౌంటర్‌ (Encounter)పై పీపుల్స్ యూనిటి ఫర్ సివిల్ లిబర్టీస్ హ్యూమన్ రైల్స్ ఫోరం అధ్యక్షురాలు జయ వింధ్యాల హై కోర్టు (AP High Court)లో పీల్ (PIL) దాఖలు చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాల ప్రకారం సిట్టింగ్ జడ్జీతో లేదా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ద్వారా నిష్పక్షపాత విచారణ (Impartial investigation) జరిపించాలని డిమాండ్ చేశారు.


జయ వింధ్యాల దాఖలు చేసిన పిటీషన్ విచారణ సందర్బంగా ఏపీ అడ్వకేట్ జనరల్ (AG) దమ్మాళపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచారు. మెజిస్టీరియల్ (Magisterial) విచారణపై పిటిషనర్ల (Petitioners)కు అభ్యంతరం ఉంటే సెషన్స్ జడ్జ్ లేదా మెజిస్ట్రేట్‌ని ఆశ్రయించాలని పేర్కొన్నారు. నేరుగా హై కోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేయడం కంటే, కింది కోర్టులో ఫిర్యాదు చేసి విచారణ కోరడం సరైన ప్రక్రియ అని ఆయన అభిప్రాయపడ్డారు.


ఈ ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత చట్టబద్దంగా జరగాల్సిన మెజిస్టీరియల్ విచారణ ఇప్పటికే మొదలైందని, దర్యాప్తు సంస్థలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాయని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే.. అడ్వకేట్ జనరల్ దమ్మాళపాటి శ్రీనివాస్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హై కోర్టు ధర్మాసనం, ఈ విషయంలో మరింత లోతుగా అధ్యాయనం చేయాలని పిటీషనర్ తరుపు న్యాయవాదిని ఆదేశించడం గమనార్హం.


ఇవి కూడా చదవండి...

శ్రీచరణికి రూ.2.5 కోట్ల బహుమతి.. స్వయంగా చెక్‌ ఇచ్చిన మంత్రి లోకేష్

ఫలితాల కోసం పరీక్ష రాసిన విద్యార్థిలా ఎదురు చూస్తా: సీఎం చంద్రబాబు

Updated Date - Dec 17 , 2025 | 07:44 PM