Share News

Taxi App: వచ్చేస్తోంది భారత్‌ 'ట్యాక్సీ'.. ఇక డ్రైవర్లకు, వినియోగదారులకు...

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:24 AM

ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉబర్, ఓలా క్యాబ్‌ సర్వీస్‌లకు ధీటుగా.. ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే ట్యాక్సీ సేవలందించేందుకు సన్నద్ధమైంది. మరిన్ని వివరాల కోసం ఈ కథనం చదవండి.

Taxi App: వచ్చేస్తోంది భారత్‌ 'ట్యాక్సీ'.. ఇక డ్రైవర్లకు, వినియోగదారులకు...
Taxi App

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం.. కొత్తగా ట్యాక్సీ యాప్‌(Taxi Application)ను తీసుకొచ్చింది. 2026 జనవరి 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం.. ప్రైవేట్ సంస్థలైన ఉబర్(Ubar), ఓలా(Ola) క్యాబ్‌లు అందిస్తున్న సేవలకు ధీటుగా ఈ యాప్‌ను నిర్వహించనుంది.


ఈ యాప్‌లో సేవలందించేందుకు ఇప్పటికే సుమారు 56 వేల మంది డ్రైవర్లు రిజిస్ట్రేషన్(Driver Registration) చేసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో ఇదివరకు ఉన్న క్యాబ్‌ ఛార్జీల(Cab Charges) నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా.. ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే ఈ సేవలను పొందే అవకాశముంది. అయితే.. తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీ(Delhi)లో ఈ యాప్ సేవలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది కేంద్రం. ఆ తర్వాత దేశంలోని మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తామని తెలిపింది.


ఇవీ చదవండి:

బోండీ బీచ్‌ ఉగ్రవాదికి హైదరాబాద్‌ మూలాలు

మహాత్ముడి ఆదర్శాలకు అవమానం

Updated Date - Dec 17 , 2025 | 12:54 PM