ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Saree In 2 Minutes: 2 నిమిషాల్లో చీర కట్టుకోవచ్చా

ABN, Publish Date - Aug 07 , 2025 | 01:55 AM

శ్రావణ శుక్రవారం దగ్గరకు వచ్చేస్తోంది. వరలక్ష్మీ వ్రతానికి ఆడవారు చీరలు కట్టుకుంటారు. అయితే యువతులు, కొత్తగా పెళ్లైన వారు చీర కట్టుకోవడానికి నానా తంటాలు పడతారు. ఎంత ప్రయాస పడిన కుచ్చిళ్లు ఎగుడుదిగుడు...

శ్రావణ శుక్రవారం దగ్గరకు వచ్చేస్తోంది. వరలక్ష్మీ వ్రతానికి ఆడవారు చీరలు కట్టుకుంటారు. అయితే యువతులు, కొత్తగా పెళ్లైన వారు చీర కట్టుకోవడానికి నానా తంటాలు పడతారు. ఎంత ప్రయాస పడిన కుచ్చిళ్లు ఎగుడుదిగుడు అవుతాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లాలన్నా ఇదే పరిస్థితి. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా నేటి యువత చీర ప్రీ ప్లీటింగ్‌ చేయించుకుంటారు. అంటే ముందుగా చీర పవిట కుచ్చిళ్లు, నడుము కుచ్చిళ్లు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోవడం అన్నమాట. దీని వలన రెండే నిమిషాల్లో చీరను సింగారించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

ముందుగా కొలతలు తీసి పెట్టుకుంటే సులభంగా చీరను ప్రీ ప్లీటింగ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం పవిట ఎంత పొడవు కావాలో చూసుకుని గుర్తుగా ముందే ఒక పిన్‌ పెట్టుకోవాలి. అలాగే కుచ్చిళ్ల కోసం చీరను కట్టు చెంగు నుంచి నడుము చుట్టూ ఒక చుట్టు తిప్పి ఒక పిన్‌ పెట్టుకోవాలి. ఇంకో వైపు కూడా అంతే పవిట నుంచి నడుము వరకు చీరను తిప్పి ఒక్కడి నుంచి ఒక మూర పొడవు వదిలేసి పిన్‌ పెట్టుకోవాలి.

చీర పవిట చెంగును తీసుకొని పెద్దవి లేదా చిన్నవి కావాల్సినన్ని కుచ్చిళ్లు పెట్టుకొని పిన్స్‌ పెట్టేయాలి. ఇప్పుడు వాటిని ఐరన్‌ చేయాలి.

ఇప్పుడు భుజం నుంచి ముందు వైపుకు చీరను సిద్ధం చేసుకోవాలి. ఇందు కోసం భుజం దగ్గర పెట్టుకున్న పిన్‌ దగ్గర నుంచి మన చేతితో ఒక మూర పొడవు మేర చీరను ముందు భాగం కోసం తీసుకుని ఆ కుచ్చిళ్లను పక్క ఫోటోలో చూపిన విధంగా కొంచెం దూరంగా జరిపి ఐరన్‌ చేసుకోవాలి.

తరువాత నడుము కుచ్చిళ్లు కోసం పెట్టుకున్న రెండు పిన్‌ల మధ్య ఉన్న చీరతో కుచ్చిళ్లు పోసుకుని టేబుల్‌ మీద పెట్టి ఐరన్‌ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ కుచ్చిళ్లను అలా ఉంచి కట్టు చెంగు వైపున మిగిలిన చీరను జాగ్రత్తగా ఈ కుచ్చిళ్ల వద్దకు తెచ్చి వీటి మీద మడత పెట్టాలి. పవిట వైపు మిగిలి ఉన్న చీరను కూడా అలాగే చేయాలి. తరువాత పవిట కుచ్చిళ్లు మినహా చీరను చతురస్రాకారంలో మడత పెట్టాలి. తరువాత పవిట కుచ్చిళ్లను జాగ్రత్తగా చీర చుట్టు తిప్పి మడత పెట్టేయాలి.

జాగ్రత్తలు :

  • ఐరన్‌ చేసే టప్పుడు చీర రకాన్ని బట్టి ఉష్ణోగ్రత సరి చూసుకోవాలి.

  • ఐరన్‌ స్టీమ్‌ వాడితే కుచ్చిళ్లు బాగా కుదురుతాయి.

నేరెళ్ల విజయలక్ష్మీ

6309725522

ఈ వార్తలు కూడా చదవండి..

జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో స్తతా చాటిన కూటమి

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

మరిన్నీ తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 07 , 2025 | 01:55 AM