Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగలెన్నో
ABN, Publish Date - Sep 10 , 2025 | 12:04 AM
గులాబీ రంగులో ఆకర్షణీయంగా, చూడగానే తినేయాలనిపించేలా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్. ఈ పండులో అనేక పోషకాల ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాల గురించి తెలుసుకుందాం...
గులాబీ రంగులో ఆకర్షణీయంగా, చూడగానే తినేయాలనిపించేలా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్. ఈ పండులో అనేక పోషకాల ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాల గురించి తెలుసుకుందాం...
డ్రాగన్ ప్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపుబ్బరం వంటివి తగ్గుతాయి.
ఈ పండులో ఐరన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అది ఎర్రరక్తణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను దూరం చేస్తుంది.
ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి అందాన్ని కాపాడుతుంది.
దీనిలోని మెగ్నీషియం, క్యాల్షియంలు ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి.
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. .
ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిస్ యాసిడ్‌లు రక్తంలో చక్కెరస్థాయులను నియంత్రించడంలో సహాయపడతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్
ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
For More AP News And Telugu News
Updated Date - Sep 10 , 2025 | 12:04 AM