Walking Benefits: రోజూ నడిస్తే గుండె జబ్బులు రావా
ABN, Publish Date - Sep 11 , 2025 | 02:25 AM
ప్రతి రోజు క్రమం తప్పకుండా నడిస్తే గుండె జబ్బులు రావని చెబుతారు. దీని వెనక ఉన్న శాస్త్రీయ కారణాలను వివరిస్తారా?...
కౌన్సెలింగ్
ప్రతి రోజు క్రమం తప్పకుండా నడిస్తే గుండె జబ్బులు రావని చెబుతారు. దీని వెనక ఉన్న శాస్త్రీయ కారణాలను వివరిస్తారా?
ఈ మధ్యకాలంలో వెబ్‌లో బహుళ ప్రచారంలో ఉన్న ఓ కథ ద్వారా దీనిని వివరిస్తాను. ‘‘మన శరీరం ఒక చిన్న పట్టణం అని ఊహించుకోండి. దీనికి ఉన్న ప్రధానమైన కూడలి మన హృదయం. రక్తనాళాలు రోడ్లు. పట్టణంలో ఉన్న రోడ్లన్నీ ఈ కూడలి వద్దకే చేరుకుంటాయి. ఇక ఈ పట్టణంలో అతి పెద్ద సమస్య సృష్టించేది కొలస్ట్రాల్. ఈ కొలస్ట్రాల్‌కు కొంత మంది సహచరులు ఉన్నారు. అయితే వీరందరిలోను- కొలస్ట్రాల్ చేసే చెడు పనుల్లో ప్రధాన భాగస్వాములు ట్రైగ్లిజరైట్స్. ఈ ట్రైగ్లిజరైట్స్ వీధుల్లో తిరుగుతూ బీభత్సం సృస్టిస్తూ ఉంటారు. వీరికి అడ్డుకోవటానికి ఆ పట్టణంలో ఒక పోలీసు దళం కూడా ఉంది. ఆ దళంలోనే హెచ్‌డీఎల్ అనే మంచి పోలీసు.. ఎల్‌డీఎల్ అనే చెడ్డ పోలీసు ఉన్నారు. వీధుల్లో బీభత్సాన్ని సృష్టించే ట్రైగ్లిజరేట్స్‌ను పట్టుకొని హెచ్‌డీఎల్ కాలేయం అనే పోలీసు స్టేషన్‌కు పంపుతాడు. అక్కడ నుంచి నగర బహిష్కరణ చేసి పట్టణం బయటకు పంపేస్తాడు. హెచ్‌డీఎల్ ఎమరుపాటుగా ఉన్నప్పుడు ఎల్‌డీఎల్ ట్రైగ్లిజరేట్స్‌ను ప్రొత్సహిస్తూ ఉంటాడు. ట్రైగ్లిజరేట్స్, ఎల్‌డీఎల్‌ను నియంత్రించగలిగినప్పుడు పట్టణం ప్రశాంతంగా ఉంటుంది. వీటిని నియంత్రించటానికి మనకున్న ఖర్చులేని మార్గం నడక. ప్రతి రోజు క్రమం తప్పకుండా నడిస్తే- ఇవన్నీ నియంత్రణలో ఉంటాయి. హృదయం ప్రశాంతంగా ఉంటుంది.’’
డాక్టర్ రాజ్‌కుమార్
జనరల్ ఫిజిషియన్
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..
Updated Date - Sep 11 , 2025 | 02:25 AM