Corset Trend Revival: కోర్సెట్ కనికట్టు
ABN, Publish Date - Oct 15 , 2025 | 12:59 AM
పురాతన కోర్సెట్ ఫ్యాషన్ మళ్లీ ఊపందుకుంది. ఒంపుసొంపులతో కనికట్టు చేసే కోర్సెట్స్... చీరలు, గౌన్లు, జీన్స్... ఇలా అన్ని రకాల దుస్తులకూ తోడవుతున్నాయి. ప్రత్యేకించి వేడుకల్లో వెలిగిపోవాలనుకుంటే ఈ ట్రెండ్‌ను ఇలా అనుసరించాలి...
ఫ్యాషన్
పురాతన కోర్సెట్ ఫ్యాషన్ మళ్లీ ఊపందుకుంది. ఒంపుసొంపులతో కనికట్టు చేసే కోర్సెట్స్... చీరలు, గౌన్లు, జీన్స్... ఇలా అన్ని రకాల దుస్తులకూ తోడవుతున్నాయి. ప్రత్యేకించి వేడుకల్లో వెలిగిపోవాలనుకుంటే ఈ ట్రెండ్‌ను ఇలా అనుసరించాలి.
17 నుంచి 19వ శతాబ్దం వరకూ వాడుకలో ఉన్న కోర్సెట్స్.. ప్రారంభంలో తిమింగలం ఎముక, స్టీలుతో రూపొందేవి. శరీరానికి అతుక్కుపోయేలా, బిగుతుగా బిగించి కట్టే కోర్సెట్స్‌తో శరీరాకృతి ఆకట్టుకునేలా మారిపోతుందనే ఉద్దేశంతో ఒకప్పటి యూరోపియన్ మహిళలు వీటిని లోదుస్తుల్లా ధరించేవారు. అయుతే ఈ దుస్తుల ఫ్యాషన్ క్రమేపీ అంతరించిపోతూ ఉండడంతో... వీటిని సరికొత్త రూపంలో వాడుకలోకి తీసుకురావాలనుకున్న ఫ్యాషన్ డిజైనర్లు... సంప్రదాయ కోర్సెట్స్‌ను మరిపించే దుస్తులను డిజైన్ చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా కోర్సెట్ గౌన్లు, చీరలు వాడుకలోకి వచ్చాయి. అయితే వీటిని ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం!
ఛాతీ, నడుము, కటి ప్రదేశాలను కచ్చితంగా కొలుచుకుని, ఆ కొలతలకు తగిన కోర్సెట్‌ను ఎంచుకోవాలి
కొందరికి ఛాతీ వెడల్పుగా ఉండొచ్చు. ఇంకొందరికి నడుము వెడల్పుగా ఉండొచ్చు. ఇలాంటి వాళ్లు ‘అండర్‌బస్ట్’ లేదా ‘ఓవర్‌బస్ట్’ కోర్సెట్‌ను ఎంచుకోవాలి
పిరుదులు, నడుము నొక్కుకుపోకుండా సౌకర్యంగా ఉండాలి
వదులు చేసుకోడానికీ, బిగుతును పెంచడానికీ వీలైన లేసింగ్ ఉండేలా చూసుకోవాలి
కాటన్, మెష్, జెన్యూన్ లెదర్‌తో తయారైన కోర్సెట్స్ ఎంచుకోవాలి
అండర్‌బస్ట్ కోర్సెట్స్ ధరించడం ఎంతో తేలిక. కాబట్టి వీటికే ప్రాధాన్యం ఇవ్వాలి
చీరకు జోడీగా ధరించాలనుకుంటే, ఓవర్‌బస్ట్ కోర్సెట్‌ను ఎంచుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 15 , 2025 | 12:59 AM