ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chinu Kala Journey: సవాళ్లను అధిగమించి గెలిచి

ABN, Publish Date - Aug 31 , 2025 | 02:45 AM

నవమాసాలు మోసిన కన్న తల్లి తనను ఏడాది వయసులోనే వదిలించుకున్నా, 15 ఏళ్లకే ఇల్లు వదిలి వెళ్లిపోవలసి వచ్చినా కుంగిపోలేదామె. అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా వంద కోట్లకు పైగా విలువైన...

నవమాసాలు మోసిన కన్న తల్లి తనను ఏడాది వయసులోనే వదిలించుకున్నా, 15 ఏళ్లకే ఇల్లు వదిలి వెళ్లిపోవలసి వచ్చినా కుంగిపోలేదామె. అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా వంద కోట్లకు పైగా విలువైన ‘‘రూబన్స్‌ యాక్సెసరీ్‌స’’కు అధిపతిగా మారారు. ఆమే ముంబైకు చెందిన చీనూ కాలా... ఆమె ప్రయాణంలోని ఆసక్తికర విషయాలివీ...

చీనూ కాలాకు మొదటినుంచీ చదువంటే పెద్దగా ఆసక్తి లేదు. డ్యాన్స్‌, ఫ్యాషన్‌, మోడలింగ్‌ పట్ల ఎంతో మక్కువ. అయినా తండ్రి కోసం చదువుకు ప్రాధాన్యమిచ్చారు. కానీ 15 ఏళ్ల వయసులో చీనూకు తండ్రితో గొడవైంది. దాంతో గుండె నిండా బాధతో, చేతిలో 300 రూపాయలతో ఇంట్లోంచి బయటకు వచ్చేశారు. ఆ తరువాత పొట్టకూటి కోసం ఆమె చేయని పని లేదు. 20 రూపాయల కోసం ఇళ్ల చుట్టూ తిరిగి కత్తులు, కోస్టర్‌ సెట్‌లు అమ్మారు. రిసెప్షనిస్టుగా, రెస్ట్టారెంట్‌లో వెయిట్ర్‌సగా పని చేశారు. వస్త్ర దుకాణంలోనూ పనిచే శారు. బ్రతుకుతెరువు కోసం పలు ఉద్యోగాలు కూడా చేశారు.

ఆ ఉద్యోగంతో...

2002లో చీనూకు టాటా కమ్యూనికేషన్స్‌లో టెలీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడే ఆమెకు అమిత్‌ కాలా పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అలా వారిద్దరూ 2004లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత చీనూ భర్తతో కలిసి బెంగళూరుకు వెళ్లిపోయారు. చీనూకు మోడలింగ్‌ పట్ల ఉన్న ఇష్టాన్ని తెలుసుకున్న అమిత్‌ దానిని గౌరవించి ఆమెకు వెన్నుదన్నుగా నిలిచారు. అమిత్‌ సహకారంతో చీనూ 2008 గ్లాడ్రాగ్స్‌ మిసెస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని, టాప్‌ 10లో చోటు సంపాదించుకున్నారు. ఆ సమయంలోనే ఫ్యాషన్‌ రంగంలో జ్యూవెలరీ, యాక్సెసరీస్‌ అవసరం ఉందని చీనూ గుర్తించారు.

లోతుగా అధ్యయనం చేసి...

ఆ తరువాత చీనూ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు తిరిగి ఆభరణాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. మార్కెట్‌లో ఎలాంటి జ్యూవెలరీ అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా, ఎక్కడ తయారుచేస్తున్నారు వంటి అంశాల గురించి తెలుసుకున్నారు.. ఆభరణాల గురించి పూర్తి అవగాహన తెచ్చుకుని 2014లో 3 లక్షల రూపాలయలతో బెంగళూరులో ఓ మాల్‌లో రూబన్స్‌ యాక్సెసరీస్‌ స్టోర్‌ను ప్రారంభించారు. ఆపై నాలుగేళ్లలోనే బెంగళూరు, హైదరాబాద్‌, కొచ్చిల్లో అయిదు స్టోర్‌లు ఏర్పాటు చేసే స్థాయికి ఆమె వ్యాపారం పుంజుకుంది. మొదట హెడ్‌ యాక్సెసరీ్‌సతో ఆమె ప్రారంభించిన రూబన్‌ యాక్సెసరీస్‌ సంస్థ నేడు తల నుంచి కాళ్ల పట్టీల వరకూ, అన్ని అభరణాలతో పాటు హ్యాండ్‌ బ్యాగుల వంటి యాక్సెసరీలను అమ్మే స్థాయికి విస్తరించి, రూ.వంద కోట్లకు పైగా టర్నోవర్‌ సాధిస్తూ జ్యూవెలరీ రంగంలో దూసుకుపోతుంది.

భయపడితే ఏదీ సాధించలేం..

విభిన్న డిజైన్లలో ఆభరణాలు రూపొందిస్తూ మగువల మనసులు దోచుకుంటున్న చీనూ.. భయపడితే ఏదీ సాధించలేమని చెబుతున్నారు. సవాళ్లు ఎదుర్కొంటేనే విజయం దరి చేరుతుందని ఓ సందర్భంలో ఆమె చెప్పారు. అలాగే కష్టపడితేనే ఫలితం ఉంటుందనీ, తాను రోజుకు 15 గంటలపైనే కష్టపడేదానినని వెల్లడించారు. ‘‘నేను పెద్దగా చదువుకోలేదు. కనీసం పాఠశాల విద్య కూడా పూర్తి చేయలేదు. కానీ జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఎన్నో విలువైన జీవిత పాఠాలు నేర్చుకున్నాను’’ అని చీనూ చెప్పారు. తాను రైల్వే స్ట్టేషన్‌లో తలదాచుకున్నప్పుడు ఎంతో మంది తిరిగి ఇంటికి వెళ్లిపోమని తనకు సలహా ఇచ్చారని, కానీ తాను మాత్రం ఎదురైన అన్ని ఒడిదొడుకులను తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగానని గుర్తుచేసుకున్నారు. తాను ఆనాడు అంత దృఢంగా ఉండడం వలనే ఈనాడు ఈ స్థాయిలో ఉన్నానని చీనూ అంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్‌ఫార్మర్‌ నెపంతో గిరిజనుడి హత్య

గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 31 , 2025 | 02:46 AM