ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chikungunya Threat: చికున్‌గున్యా ముప్పు

ABN, Publish Date - Oct 07 , 2025 | 01:20 AM

దీర్ఘకాలంలో భారతదేశం చికున్‌గున్యా ప్రభావానికి అధికంగా గురి కాక తప్పదనీ, ప్రతి ఏటా 51 లక్షల మంది భారతీయులు దోమల ద్వారా వ్యాపించే ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉందనీ బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌...

అధ్యయనం

దీర్ఘకాలంలో భారతదేశం చికున్‌గున్యా ప్రభావానికి అధికంగా గురి కాక తప్పదనీ, ప్రతి ఏటా 51 లక్షల మంది భారతీయులు దోమల ద్వారా వ్యాపించే ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉందనీ బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌, గ్లోబల్‌ హెల్త్‌లో ప్రచురితమైన గ్లోబల్‌ మోడలింగ్‌ అధ్యయనం సూచిస్తోంది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు ఆందోళన కలిగించేలా ఉంటున్నాయనీ, ఇప్పటికే చికున్‌గున్యా బారిన పడిన వారిలో 50 శాతం మంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఆధారాల ద్వారా వెల్లడైందని వారు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 1.40 కోట్ల మంది ప్రజలు దీర్ఘకాలంలో చికున్‌ గున్యా బారిన పడే ముప్పును ఎదుర్కోబోతున్నట్టు ఈ అధ్యయనం అంచనా వేసింది. చికున్‌గున్యాకు సంబంధించి ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న డాటాను. చికున్‌గున్యా సోకే అవకాశాలను పెంచే అంశాలతో జోడించడం ద్వారా ఈ వ్యాధి భారాన్ని అంచనా వేసిన మొట్టమొదటి అధ్యయనమిది. ఈ అధ్యయనంలో సమర్పించిన అంచనాలు ప్రాంతాల ప్రాధాన్యతకూ, పదేళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు లక్ష్యంగా వ్యాక్సీన్‌ అభివృద్ధికి తోడ్పడతాయని పరిశోధక బృందం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి..

ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 07 , 2025 | 01:20 AM