ChatGPT Health Risks: చాట్ జిపిటితో ఆరోగ్య ముప్పు
ABN, Publish Date - Aug 26 , 2025 | 12:53 AM
కృత్రిమ మేథస్సు ఎఐ చాట్ జిపిటి అందుబాటులోకొచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యల పరిష్కారాలకూ, సూచనలకూ దాని మీద ఆధారపడే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అయితే ఒక 60 ఏళ్ల వ్యక్తి చాట్ జిపిటి సూచించిన సలహాతో...
పారాహుషార్
కృత్రిమ మేథస్సు ఎఐ చాట్ జిపిటి అందుబాటులోకొచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యల పరిష్కారాలకూ, సూచనలకూ దాని మీద ఆధారపడే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అయితే ఒక 60 ఏళ్ల వ్యక్తి చాట్ జిపిటి సూచించిన సలహాతో ఆస్పత్రి పాలైన ఉదంతమొకటి యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో తాజాగా ప్రచురితమైంది. ముగ్గురు వైద్యులు రాసిన ఆ నివేదికలో...
ఒక 60 ఏళ్ల వ్యక్తి చిత్తభ్రమలతో ఆస్పత్రికి చేరుకుని, పొరుగింటి వ్యక్తి తన మీద విష ప్రయోగం చేస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేశాడు. అయితే అతనికి పరీక్షలు చేపట్టినప్పుడు విస్తుపోయే విషయం బయల్పడింది. అతను గత కొంతకాలంగా చాట్ జిపిటి సలహా మేరకు టేబుల్ సాల్ట్‌కు బదులుగా బ్రొమైడ్‌ను తీసుకుంటున్నట్టు వైద్యులు కనిపెట్టారు. ఉప్పుతో పొంచి ఉండే ఆరోగ్య ముప్పుల నుంచి తప్పించుకోవడం కోసం ప్రత్యామ్నాయాన్ని సూచించమని చాట్ జిపిటిని అడిగినప్పుడు, అది బ్రొమైడ్‌ను సూచించిందనీ, ఆ సలహా మేరకు మూడు నెలలుగా తాను బ్రొమైడ్ తీసుకుంటున్నాననీ సదరు వ్యక్తి చెప్పడం జరిగింది. బ్రోమైడ్ టాక్సిసిటీ ఫలితంగా అతను చిత్తభ్రమలకు లోనైనట్టు కనిపెట్టిన వైద్యులు ఆ తర్వాత చికిత్సతో పరిస్థితిని సరిదిద్దారు. వాస్తవానికి బ్రోమైడ్‌ను పశువెద్యంలో భాగంగా, కుక్కలు, పిల్లుల మూర్ఛల చికిత్సలో పశువైద్యులు ఉపయోగిస్తూ ఉంటారు. ఇదే బ్రోమైడ్ ఉప్పు రూపంలో విస్తృతంగా దొరుకుతూ ఉండడంతో విదేశాల్లో వీటి వాడకం పెరుగుతోంది. అయితే అసలు విషయాన్ని నిర్థారించుకునేందుకు వైద్యులు చాట్ జిపిటిని సంప్రతించి... ‘క్లోరైడ్’కు ప్రత్నామ్నాయం ఏంటని అడిగినప్పుడు, ఆ ఎఐ... ‘బ్రోమైడ్’ను సూచించింది. అంతేతప్ప, దాంతో ముడిపడి ఉండే ఆరోగ్య హెచ్చరికలను ప్రస్తావించలేదు. అలాగే ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారని కూడా ఎదురు ప్రశ్నించలేదు.
ఇదే ప్రశ్న ఒక వైద్యుడిని అడిగినప్పుడు, కచ్చితంగా భిన్నమైన సమాధానం వచ్చి ఉండేదనీ, చాట్ జిపిటిలా వైద్యులు పొరపాట్లు చేసే ఆస్కారం ఉండదనీ, కాబట్టి వైద్య సలహాల కోసం ఎఐ మీద ఆధారపడడం మానుకోవాలనీ వైద్యులు సూచిస్తున్నారు.
Also Read:
గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..
కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..
For More Telangana News and Telugu News..
Updated Date - Aug 26 , 2025 | 12:53 AM