Changing Trends in Art Collecting: పెయింటింగ్స్ పట్ల ప్రజల అభిరుచి మారింది
ABN, Publish Date - Sep 18 , 2025 | 02:32 AM
ఒకప్పుడు హైదరాబాద్ అనేక రకాల సంస్కృతులు.. సంప్రదాయాల సమ్మేళనం. ఈ మధ్య కాలంలో ఆ పునర్‌వైభవాన్ని తీసుకురావటానికి కృషి చేస్తున్న వారిలో మిహికా దగ్గుబాటి ఒకరు. ప్రముఖ నటుడు...
ఒకప్పుడు హైదరాబాద్ అనేక రకాల సంస్కృతులు.. సంప్రదాయాల సమ్మేళనం. ఈ మధ్య కాలంలో ఆ పునర్‌వైభవాన్ని తీసుకురావటానికి కృషి చేస్తున్న వారిలో మిహికా దగ్గుబాటి ఒకరు. ప్రముఖ నటుడు రాణా భార్యగానే కాకుండా.. కళా ప్రపంచంలో మిహికాకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఆమె నిర్వహిస్తున్న ‘ఆర్ట్ కనెక్ట్’ అనే ఎగ్జిబిషన్‌కు మంచి ఆదరణ కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను ‘నవ్య’ పలకరించింది.
ఒకప్పుడు రాజకుటుంబాలు గొప్పగా బతికేవి. వారి వద్ద నుంచి పెయింటింగ్స్, ఫర్నిచర్‌లను జాగ్రత్తగా ఉంచుకోవటానికి వారికి తగినంత ఆర్థిక వనరులు ఉండేవి. కానీ వారికి ఆర్థిక వనరులు తగ్గిపోయాయి. వ్యయం పెరిగిపోయింది. దీనితో వారు తమ వద్ద ఉన్న వారసత్వ సంపదను సరిగ్గా కాపాడలేకపోతున్నారు. అలాంటి వారసత్వ సంపదను కాపాడి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. కానీ దానికి వనరులు అవసరం.
హైదరాబాద్ కళా రంగం ఎలా ఉంది?
ఒకప్పుడు హైదరాబాద్ రకరకాల కళలకు ప్రసిద్ధి. ఎంఎ్‌ఫహుస్సేన్ వంటి అనేక మంది పెయింటర్స్‌కు ఇక్కడ మంచి ఆదరణ లభించింది. అయితే ఇక్కడ ప్రజలు సంప్రదాయబద్ధమైన చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తారు. ఈ మధ్యకాలంలో మన దేశంలోని కళారంగంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగానే కాదు.. మన దేశంలో కూడా కొత్త కొత్త ఆర్టిస్టులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అందువల్ల దేశంలోని అనేక స్టూడియోల నుంచి పెయింటింగ్స్‌ను, ఇతర కళాకృతులను ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. ఈ ప్రదర్శనకు మంచి స్పందన లభిస్తోంది.
ఇక్కడ ఒకప్పుడు కళా రంగం ఎలా ఉండేది?
నేను హైదరాబాద్‌లోనే పుట్టాను. ఇక్కడే పెరిగాను. ఒకప్పుడు ఇక్కడ అనేక ప్యాలె్‌సలు ఉండేవి. స్వాతంత్రం తర్వాత అనేక మంది రాజకుటుంబీకులు తమ ప్యాలె్‌సలలో ఉన్న పెయింటింగ్స్, ఫర్నీచర్స్‌ను అమ్మేశారు. మా అమ్మమ్మ వాళ్లు కూడా పైగా రాజకుటుంబీకుల నుంచి ఒక క్రిస్టల్ డైనింగ్ టేబుల్ కొన్నారు. కళా రంగం గురించి నాకు పరిచమయింది అప్పుడే! ఆ తర్వాత ప్రభుత్వం దానిని వెనక్కి తీసేసుకుంది. అద్భుతమైన యాంటిక్ ఫర్నిచర్స్, గొప్ప గొప్ప ఆర్టిస్టుల పెయింటింగ్స్‌ను చూస్తూ పెరిగాను. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే- నేను న్యూయార్క్‌కు చదువుకోవటానికి వెళ్లినప్పుడు- అక్కడి మ్యూజియంలలో పెయింటింగ్స్‌ను చూశాను. అవి వర్తమాన ప్రపంచానికి సంబంధించినవి. అంతకు ముందు నేను యూర్‌పలోని దేశాలకు వెళ్లాను. అక్కడ సంప్రదాయబద్ధమైన పెయింటింగ్స్ ఉండేవి. ఈ రెండింటికీ మధ్య తేడా స్పష్టంగా తెలిసింది. వర్తమాన కళాకారుల పెయింటింగ్స్ పట్ల ప్రేమ పెరుగుతూ వచ్చింది.
ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పులేమిటి?
హైదరాబాద్ ప్రజల అభిరుచులలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు తంజావూర్ పెయింటింగ్స్‌ను ఎక్కువగా ఆదరించేవారు. గోడల మీద దేవుడి పటాలను పెట్టుకోవటానికి ఎక్కువ ఆసక్తి చూపించేవారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒకప్పుడు పెయింటింగ్స్‌ను కేవలం ఉన్నత వర్గాల వారు మాత్రమే ఆదరించేవారు. అయితే ఈ మధ్యకాలంలో యువతీయువకులు తమ ఇళ్లలో రకరకాల పెయింటింగ్స్, చిన్న చిన్న శిల్పాలు వంటివి పెట్టుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ఖాళీ గోడపై ఏం పెట్టుకోవాలనే విషయాన్ని ఎవరు పెద్దగా ఆలోచించేవారు కారు. కాని ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్స్‌తో కూర్చుని ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు పెయింటింగ్స్ గోడకు పెట్టుకొనే ఆభరణాలు. కానీ ఇప్పుడు అవి తప్పనిసరైన అలంకరణలు. జాగ్రత్తగా గమనిస్తే ఈ మధ్యకాలంలో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్లకు ఇంటీరియర్ డిజైనర్స్ అనేక మంది వస్తున్నారు.
ఈ ఒరవడికి ప్రధాన కారణాలేమిటి?
ప్రజల అభిరుచులు మారుతున్నాయి. అంతే కాదు. ఒకప్పుడు పెయింటింగ్స్, ఫర్నిచర్ వంటివి హోదాకు చిహ్నాలు. వాటికి వాణిజ్యపరమైన విలువ ఏమి ఉండేది కాదు. కానీ ఇప్పుడు పెయింటింగ్స్‌ను భవిష్యత్తుకు పెట్టుబడిలా చూస్తున్నారు. వాటిని తనఖా పెట్టుకొని బ్యాంకులు అప్పులు కూడా ఇస్తున్నాయి. అంటే భూములకు, భవంతులకు ఎంత విలువ ఉందో.. పెయింటింగ్‌లకు కూడా అంతే విలువ ఉంది. ఈ మధ్యకాలంలో షేర్స్‌లో.. స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లే.. పెయింటింగ్స్‌లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. వారి పెట్టుబడులపై వచ్చే రిటర్న్ కూడా బావుంటున్నాయి. ఇక్కడ మనం కోవిడ్ వల్ల మన సమాజంలో వచ్చిన మార్పులను కూడా గమనించాలి. కోవిడ్ సమయంలో ఎక్కువ మంది ఇళ్లలోనే ఉండిపోయారు. వారికి.. ఇంటికి మధ్య అనుబంధం బాగా బలపడింది. ఒకప్పుడు ఎక్కువ బయటతిరిగే వారు కూడా కోవిడ్ తర్వాత ఇంట్లో ఎక్కువ సమయం గపడటానికి ఇష్టపడుతున్నారు. తమ ఇంటిని వినూత్నంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. అలాంటి వారు కూడా పెయింటింగ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు.
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్
ఆర్ట్ మార్కెట్ ఎలా ఉంది?
మన దేశంలో ముంబాయి ఎప్పుడు అగ్రస్థానంలో ఉంటుంది. ఎందుకంటే ప్రొగ్రసివ్ మూమెంట్ అక్కడి నుంచే ప్రారంభమయింది. జెజె స్కూల్ అక్కడే ఉంది. దీని వల్ల అక్కడ అనేక మంది చిత్రకారులు నైపుణ్యం సాధించారు. విదేశాలకు వెళ్లారు. అక్కడ కొత్త పద్ధతులు తెలుసుకున్నారు. మళ్లీ ముంబాయికి తిరిగి వచ్చి- మన సంస్కృతికి తగ్గట్టుగా పెయింటింగ్స్ వేయటం మొదలుపెట్టారు. అంతే కాకుండా ముంబాయి మన ఆర్థిక రాజధాని. అందువల్ల అక్కడ అనేక మంది ఆర్ట్ కలెక్టర్స్ కూడా ఉన్నారు.
ఇక బరోడా కూడా చిత్రకళకు ఒక ప్రధానమైన కేంద్రం. ఇక స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఢిల్లీలో అనేక మంది కళాకారులు తమ కళాకృతులను ప్రదర్శించటం మొదలుపెట్టారు. దీని వల్ల ఢిల్లీకి కూడా ఒక ముఖ్యమైన కేంద్రంగా ఏర్పడింది. ఇక కోల్‌కత్తా, బెంగుళూరులలో కూడా మంచి పెయింటింగ్స్‌కు ఆదరణ లభిస్తోంది.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
పెయింటింగ్స్ అనేవి జీవిత కాలం మనతో పాటుగా ఉండే ఎమోషన్స్. అలాంటి వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసి కొనుక్కొంటూ ఉంటా. ఈ మధ్యకాలంలో నేను రెండు డాలీలు (సుప్రసిద్ధ చిత్రకారుడు డాలీ వేసిన పెయింటింగ్స్)ను కొన్నాను. చిన్నతనం నుంచి నేను ఆదరించే చిత్రకారుడి పెయింటింగ్స్ సొంతం చేసుకోవటం నాకొక కల. అది నిజమైంది.
Also Read:
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
దమ్ముంటే అలా చెయ్యండి.. సూర్యకుమార్ యాదవ్‌కు ఆప్ నేత సవాల్..
For More Latest News
Updated Date - Sep 18 , 2025 | 02:32 AM