ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Boost Your Heart Health: వీటితో గుండెజబ్బులు దూరం

ABN, Publish Date - Oct 14 , 2025 | 05:58 AM

గ్రీన్‌ టీ, దానిమ్మ రసం, బీట్‌రూట్‌ రసం, పసుపు కలిపిన పాలు... వీటితో గుండె రక్తనాళాల్లో అవరోధాలు పేరుకునే పరిస్థితి కుంటుపడుతుంది. అందుకు తోడ్పడే అంశాలు ఈ పానీయాల్లో ఏమున్నాయంటే....

గ్రీన్‌ టీ, దానిమ్మ రసం, బీట్‌రూట్‌ రసం, పసుపు కలిపిన పాలు... వీటితో గుండె రక్తనాళాల్లో అవరోధాలు పేరుకునే పరిస్థితి కుంటుపడుతుంది. అందుకు తోడ్పడే అంశాలు ఈ పానీయాల్లో ఏమున్నాయంటే....

ఆక్సిజన్‌ను మోసుకువెళ్తూ, రక్తప్రవాహానికి తోడ్పడే రక్తనాళాల్లో కాలక్రమేణా అవరోధాలు పేరుకుపోయి, అథెరోస్క్లెరోసిస్‌ అనే సమస్య తలెత్తుతుంది. క్రమేపీ పేరుకుపోయే కొలెస్ట్రాల్‌, కొవ్వు లేదా క్యాల్షియంలు రక్తనాళాలను మూసుకుపోయేలా చేసి, రక్తపోటుకూ అంతిమంగా గుండెపోటుకూ దారి తీస్తాయి. కాబట్టి ఈ పరిస్థితికి దోహదపడే ఇన్‌ఫ్లమేషన్‌, చెడు కొలెస్ట్రాల్‌లను తగ్గించే ఆహార నియమాలను పాటించాలి.

గ్రీన్‌ టీ: గ్రీన్‌టీలోని కాటెచిన్స్‌ అనే యాంటీఆక్సిడెంట్స్‌.. రక్తనాళాల్లో ప్రధాన అవరోధాలకు దోహదపడే, ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌నూ, ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌నూ తగ్గిస్తాయి. ప్రతిరోజూ గ్రీన్‌ టీ తాగడం వల్ల, రక్తనాళాల్లోని అంతర్గత గోడల పనితీరు మెరుగుపడి, రక్తనాళాల్లో నమ్యత పెరిగి రక్త ప్రవాహం సాఫీగా జరుగుతుంది. కాబట్టి రోజుకు రెండు నుంచి మూడు కప్పుల తాజా గ్రీన్‌ టీ తాగడం ద్వారా గుండె రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి

దానిమ్మ రసం: దానిమ్మలోని ప్యూనికలాజిన్స్‌, యాంథోసయానిన్స్‌.. రక్తనాళాల్లో ఇన్‌ఫ్లమేషన్‌నూ ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌నూ తగ్గిస్తాయి. అలాగే క్రమం తప్పకుండా దానిమ్మ రసం తాగితే గుండె రక్తనాళాల్లో ప్లేక్‌ నిల్వ తగ్గుతుంది. ఈ పండులోని ఫ్లేవనాయిడ్స్‌ రక్తంలో కొలెస్ట్రాల్‌ ఆక్సిడేషన్‌ను కూడా తగ్గిస్తాయి. కాబట్టి ఈ పండు ప్రయోజనాలను పూర్తిగా పొందాలనుకుంటే తాజా దానిమ్మ రసాన్ని చక్కెర జోడించకుండా తాగాలి

బీట్‌రూట్‌ రసం: ఈ రసంలో నైట్రేట్స్‌ ఉంటాయి. వీటిని శరీరం నైట్రిక్‌ ఆమ్లంగా మలుచుకుంటుంది. దాంతో రక్తనాళాలు విప్పారి, రక్తపోటు తగ్గుతుంది, రక్త ప్రవాహం మెరుగవుతుంది. ప్రతి రోజూ బీట్‌రూట్‌ రసం తాగడం వల్ల రక్తనాళాల బిరుసుతనం తగ్గుతుందని పరిశోధనలు నిరూపించాయి

ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 06:00 AM