Boost Hair Health: గుడ్డు పెంకుతో జుట్టుకు ఆరోగ్యం
ABN, Publish Date - Sep 01 , 2025 | 02:58 AM
కోడిగుడ్లను తినేసి, పెంకులను పడేస్తూ ఉంటాం. కానీ ఆ పెంకులు శిరోజాల పెరుగుదలకు సహాయపడతాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
కోడిగుడ్లను తినేసి, పెంకులను పడేస్తూ ఉంటాం. కానీ ఆ పెంకులు శిరోజాల పెరుగుదలకు సహాయపడతాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
జుట్టు ఊడడానికి ఓ ప్రధాన కారణం కాల్షియం లోపం. కోడిగుడ్డు పెంకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
గుడ్డు పెంకులోని ప్రోటీన్లు, మెగ్నిషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు జుట్టు పెరుగుదలకు దోహదపడతాయి.
గుడ్డు పెంకులోని పోషకాలు మాడు పీహెచ్ స్థాయులను బ్యాలెన్స్ చేస్తాయి. చుండ్రును, దురదను తగ్గించేందుకు సహాయపడతాయి.
ఇలా సిద్ధం చేసుకోవాలి
కోడి గుడ్లను పగలగొట్టిన తరువాత పెంకులను నీటితో శుభ్రంగా కడగాలి. తరువాత తడిని పూర్తిగా ఆరనిచ్చి ఆ పెంకులను మెత్తని పొడి చేయాలి. దానిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
ఇలా వాడాలి
ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ గుడ్డు పెంకుల పొడి వేసి కలపాలి. దీనిని మాడుకు రాసి కొంచెం సేపు మర్దన చేయాలి. 30 -45 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది.
గుడ్డు పెంకుల పొడిని షాంపూలో కలుపుకుని కూడా వాడొచ్చు.
రెండు స్పూన్ల ఆలివ్ నూనెలో ఒక స్పూన్ పెంకుల పొడి కలిపి త లకు పట్టించాలి. ఆరగంట తరువాత తలస్నానం చేయాలి. వారినికోసారి ఇలా చేయాలి.
రెండ టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జులో ఓ స్పూన్ పెంకుల పొడిని కలిపి తలకు పట్టించాలి. అరగంట తరువాత వేడి నీళ్లతో కడిగేయాలి. వారానికో రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది.
ఇవి కూడా చదవండి
హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది.. మంత్రి ఉత్తమ్‌పై హరీష్‌రావు ఫైర్
Updated Date - Sep 01 , 2025 | 02:58 AM