Clean Fruits And Vegetables: పండ్లు కూరగాయలను ఎలా శుభ్రం చేయాలంటే
ABN, Publish Date - Sep 06 , 2025 | 02:19 AM
మనం బజారు నుంచి తెచ్చుకున్న పండ్లు, కూరగాయలు తాజాగా కనిపిస్తున్నప్పటికీ వాటిమీద పురుగు మందుల అవశేషాలు, కొన్ని రకాల రసాయనాలు, దుమ్ము, ధూళి, క్రిమికీటకాల గుడ్లు లాంటివి ఉండవచ్చు. వీటివల్ల ఎన్నో...
మనం బజారు నుంచి తెచ్చుకున్న పండ్లు, కూరగాయలు తాజాగా కనిపిస్తున్నప్పటికీ వాటిమీద పురుగు మందుల అవశేషాలు, కొన్ని రకాల రసాయనాలు, దుమ్ము, ధూళి, క్రిమికీటకాల గుడ్లు లాంటివి ఉండవచ్చు. వీటివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. అందుకే పండ్లను తినేముందు, కూరగాయలను వండేముందు సరైన విధానంలో శుభ్రం చేయాలంటున్నారు నిపుణులు.
ఆ వివరాలు...
కూరగాయలను ముందుగా ఉప్పు, పసుపు కలిపిన నీళ్లతో శుభ్రంగా కడగాలి. తరవాతనే ముక్కలుగా తరగాలి. ఒకవేళ వాటిని నిల్వ చేసుకోవాలనుకుంటే మాత్రం ముందుగా కడగకూడదు. అలా కడిగితే తేమ వల్ల బ్యాక్టీరియా పెరిగి కూరగాయలు తొందరగా పాడవుతాయి.
ఆకుకూరలకు ముందుగా కాడలు తుంచి శుభ్రం చేయాలి. తరవాత ఆ ఆకులను జల్లి బుట్టలో వేసి పంపు నీళ్ల ధార కింద పెట్టి కడగాలి. ఇసుక, మట్టి లాంటివి పూర్తిగా పోయే వరకూ ఆకులను చేత్తో రుద్దుతూ కడగాలి. వర్షాకాలంలో మాత్రం ఆకులను కొద్దిసేపు ఉప్పునీటిలో నానబెట్టడం మంచిది.
క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌లను ఉప్పు నీళ్లలో పావుగంటసేపు ఉంచితే వాటిలోని పురుగులు బయటికి వచ్చేస్తాయి.
బంగాళదుంప, చామదుంప, చిలకడ దుంప, కంద, ముల్లంగి, అల్లం, కేరట్‌లను మెత్తని బ్రష్ లేదా స్పాంజ్‌తో రుద్దుతూ కడిగితే వాటికి అంటుకుని ఉన్న మట్టి, బ్యాక్టీరియా తొలగిపోతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..
మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి
Read Latest TG News and National News
Updated Date - Sep 06 , 2025 | 02:19 AM