Minister Thummala On Urea: ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..
ABN , Publish Date - Sep 05 , 2025 | 07:29 PM
యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లు ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 20 రోజులు.. రోజుకు 10,000 మెట్రిక్ టన్నుల చొప్పున రాష్ట్రానికి సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు
హైదరాబాద్: తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్‌తో ఎట్టకేలకు రైతలకు యూరియా కష్టాలు తీరనున్నట్లు కనిపిస్తున్నాయి. యూరియాపై ప్రభుత్వం చేసిని కసరత్తుకు ప్రతిఫలంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యూరియాను సరఫరా చేసింది. ఇవాళ(శుక్రవారం) రాష్ట్రానికి 11, 181 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు..
యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లు ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 20 రోజులు.. రోజుకు 10,000 మెట్రిక్ టన్నుల చొప్పున రాష్ట్రానికి సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. రేపు మరో 9039 మెట్రిక్ టన్నులు యూరియా వస్తుందని పేర్కొన్నారు. RFCL మూత పడటంతో కేంద్రం దేశీయ తయారీ యూనిట్ల నుంచి కూడా అదనంగా 30,000 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించడానికి కేంద్రం అంగీకరించినట్లు తెలిపారు.
దీని వలన రాష్ట్రంలో ఎరువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉంటుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రామగుండం RFCL ఎరువుల కర్మాగారం నిలిచిపోయిన కారణంగా రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలోనికి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వెంటనే ఉత్పత్తి ఆరంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను కోరినట్లు చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వచ్చే 3,4 రోజుల్లో యూనిట్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ పరిణామాలతో తెలంగాణలో ఎరువుల లభ్యత మరింత మెరుగుపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ, గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్
మరోసారి వైసీపీ ఫేక్ ప్రచారం.. అసలు విషయమిదే..