Share News

AP Assembly Sessions : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ, గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్

ABN , Publish Date - Sep 05 , 2025 | 04:10 PM

ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. వరుసగా 60 అసెంబ్లీ పని దినాలకు హజరుకానిపక్షంలో వైసీపీ సభ్యులకు అనర్హత వేటు..

AP Assembly Sessions : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ, గవర్నర్  గెజిట్ నోటిఫికేషన్
AP Assembly Sessions

అమరావతి, సెప్టెంబర్ 5 : ఈ నెల 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు18వ తేదీ ఉదయం 9 గంటలకు, కౌన్సిల్ సమావేశాలు ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. మొదటి రోజు సమావేశం అనంతరం రెండు సభల బిఎసి సమావేశాలు జరుగుతాయి. ఆ రోజు సమావేశాల ఏజెండా, ఎన్ని రోజులు సభలు జరగాలి అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.


ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హజరు కాబోమని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే, వరుసగా 60 అసెంబ్లీ పని దినాలు హజరుకానిపక్షంలో అనర్హత వేటు పడుతుందని ఇప్పటికే డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణంరాజు వైసీపీ నేతల్ని హెచ్చరించారు.


ఇలా ఉండగా, తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు సదస్సుకు హాజరు కానున్నట్టు ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించిన సంగతి తెలిసిందే.


ఈ కార్యక్రమానికి తొలిరోజు సీఎం చంద్రబాబు, లోక్‌సభ స్పీకర్‌ హాజరవుతారు. సమావేశాల ముగింపు రోజున గవర్నర్‌ హాజరుకానున్నారని ఏపీ స్పీకర్‌ తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు శ్రీవారి దర్శనం కల్పించించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెప్టెంబరు 18 నుంచి శాసనసభ సమావేశాలు జరగుతాయని, ఈమేరకు ఎమ్మెల్యేలకు సమాచారం పంపించినట్టు కూడా అయ్యన్న పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 05 , 2025 | 04:34 PM