ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Best Vegetarian Protein: నాకు ప్రొటీన్‌ ఎలా లభిస్తుంది

ABN, Publish Date - Sep 18 , 2025 | 02:14 AM

ప్రొటీన్‌ కేవలం మాంసాహారంలో ఉంటుందని.. శాఖాహారులకు ప్రొటీన్‌ తక్కువ ఉంటుందనుకోవటం ఒక అపోహ మాత్రమే. అయితే ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకుంటే తగినంత ప్రొటీన్‌ ఉందా? లేదా అనే...

కౌన్సెలింగ్‌

నేను ఈ మధ్యకాలంలో జిమ్‌కు వెళ్లటం మొదలుపెట్టాను. నేను చిన్నప్పటి నుంచి శాఖాహారిని. జిమ్‌ ట్రైనర్‌ - ‘‘మీకు ప్రొటీన్‌ సరిపోవటం లేదు.. ప్రొటీన్‌ పౌడర్‌ తాగండి’’ అని సలహా ఇస్తున్నాడు. ప్రొటీన్‌ పౌడర్‌ తాగటం నాకు ఇష్టం లేదు. వీటి వల్ల అనేక అనర్ధాలు కలుగుతాయని చదివాను. పౌడర్‌ కాకుండా ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే నాకు తగినంత ప్రొటీన్‌ లభిస్తుంది?

- చందన, వరంగల్‌

ప్రొటీన్‌ కేవలం మాంసాహారంలో ఉంటుందని.. శాఖాహారులకు ప్రొటీన్‌ తక్కువ ఉంటుందనుకోవటం ఒక అపోహ మాత్రమే. అయితే ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకుంటే తగినంత ప్రొటీన్‌ ఉందా? లేదా అనే విషయం తెలుస్తుంది. ఇక మార్కెట్‌లో లభ్యమవుతున్న రకరకాల ప్రొటీన్‌ పౌడర్లు అంత మంచివి కావు. డాక్టర్‌ చెబితేనే వీటిని తీసుకోవాలి. మీ అంతట మీరు ప్రకటనలు చూసి కొనుగోలు చేయటం మంచిది కాదు. ఇక అనేక శాఖాహార ఆహార పదార్థాలలో ప్రొటీన్‌ లభ్యమవుతుంది. వీటిని క్రమం తప్పకుండా తింటే శరీరానికి తగినంత ప్రొటీన్‌ లభిస్తుంది. ఇవి ఏ పరిమాణాలలో తినాలనేది శరీర బరువుపైన.. ప్రతి రోజు చేసే పనిపైన ఆధారపడి ఉంటుంది. మీకు సమీపంలో ఉన్న న్యూట్రిషని్‌స్టను అడిగి ఈ పదార్థాలు ఎంత తినాలో నిర్ణయించుకోండి. ఆ పదార్థాలేమిటో చూద్దాం..

గీక్‌ యోగర్ట్‌: ఇది చిక్కటి పెరుగు. కానీ ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఒక కప్పు గీక్‌ యోగర్ట్‌లో 23 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫా్‌స్టలో లేదా మధ్యాహ్నం లంచ్‌లో దీనిని తింటే మంచిది. కొందరికి భోజనంలో పెరుగు తినటం ఇష్టం ఉండదు. అలాంటి వారు దీనిని విడిగా తింటే ప్రొటీన్‌ లభిస్తుంది. ఇది అన్ని సూపర్‌ బజార్లలో లభిస్తుంది.

చీజ్‌: ప్రొటీన్‌ విషయంలో మాంసాహారులకు మాంసం ఎలాగో శాఖహారులకు చీజ్‌ అలాగ! చీజ్‌ను ముక్కలు చేసుకొని తినటం ఇష్టం లేని వారు కూర చేసుకొని తినవచ్చు.

తోఫు: ఈ మధ్యకాలంలో ఇది కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రతి 100 గ్రాముల తోఫులో 8 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తుంది. దీనిని రకరకాల కూరల్లో చేసుకొని తినవచ్చు.

శనగలు: ప్రతి 100 గ్రాముల శనగలలో 9 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. అందువల్ల ప్రతి రోజు క్రమం తప్పకుండా శనగలు తింటే ప్రొటీన్‌ విలువలు పెరుగుతాయి.

క్వినోవా: ఈ మధ్యకాలంలో కొందరు వరి అన్నం బదులుగా క్వినోవా తింటున్నారు. దీనిలో ఫైబర్‌, మినరల్స్‌తో పాటుగా ప్రొటీన్‌ కూడా ఉంటుంది.

మానస

న్యూట్రిషినిస్ట్‌, హైదరాబాద్‌

Also Read:

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ

దమ్ముంటే అలా చెయ్యండి.. సూర్యకుమార్ యాదవ్‌‌కు ఆప్ నేత సవాల్..

For More Latest News

Updated Date - Sep 18 , 2025 | 02:14 AM