Home Remedies for Feet: పాదాలు పదిలంగా
ABN, Publish Date - Aug 20 , 2025 | 01:10 AM
అమ్మాయిలు ముఖం పట్ల చూపించిన శ్రద్ధ పాదాల మీద చూపించరు. దాంతో పాదాలు పగుళ్లకు లోనై అందవిహీనంగా మారతాయి. కాబట్టి పాదాలను...
అమ్మాయిలు ముఖం పట్ల చూపించిన శ్రద్ధ పాదాల మీద చూపించరు. దాంతో పాదాలు పగుళ్లకు లోనై అందవిహీనంగా మారతాయి. కాబట్టి పాదాలను అందంగా ఉంచుకోవడం ఎలానో తెలుసుకుందాం...
పాదాలకు తేమ అందించడం చాలా అవసరం. లేకపోతే పాదాలు పొడిబారి పగుళ్లుకు గురవుతాయి. అలా అవ్వకూడదంటే రోజూ పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. తేనె పగిలిన పాదాలకు చక్కని మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
అలివ్‌నూనె పాదాలకు రక్షణనిస్తుంది. కాబట్టి రోజ్‌వాటర్, ఆలివ్‌నూనె కలిసి వారానికొకసారి పాదాలకు రాయడం వలన పాదాలు అందంగా మారతాయి.
అరటిపండులోని విటమిన్-ఎ, బి6, సిలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. అరటిపండు గుజ్జును పాదాలకు రాయాలి.
వారానికి ఒకసారి ఇంటి వద్దే పెడిక్యూర్ చేసుకుంటే పాదాలు అందంగా, మృదువుగా ఉంటాయి. పెడిక్యూర్ ఎలా చేసుకోవాలంటే..
ఒక బకెట్‌లో పాదాలు, మడిమలు మునిగేలా గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఆ నీళ్లలో ఒక చెంచా వంటసోడా, కొంచెం షాంపు, గ్లిజరిన్ వేసి కలపాలి. ఇందులోనే ఒక నిమ్మకాయను పిండాలి. ఈ నీళ్లలో పాదాలు మునిగేలా పెట్టి పావుగంట సేపు ఉండాలి. తరువాత పాదాలను బయటకు తీసి బ్రష్‌తో మడమలు, గోళ్లు, మడమలు, పాదాలను బాగా రుద్దాలి. ఆపై ప్యుమిన్ స్టోన్‌ను తీసుకుని మృతచర్మాన్ని తొలగించాలి. ఆపై మంచి నీళ్లలో కాళ్లను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 20 , 2025 | 01:11 AM