Bank Recruitment 2025: బ్యాంక్ ఉద్యోగాలు
ABN, Publish Date - Sep 15 , 2025 | 05:50 AM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన 122 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది...
ఎస్‌బీఐలో మేనేజర్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన 122 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మేనేజర్(క్రెడిట్ అనలిస్ట్): 63 పోస్టులు
మేనేజర్(ప్రొడక్ట్స్-డిజిటల్ ప్లాట్‌ఫామ్స్): 34 పోస్టులు
డిప్యూటీ మేనేజర్(ప్రొడక్ట్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్): 25 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఎంబీఏ/పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ సీఏ/సీఎ్‌ఫఏ/ఐసీడబ్ల్యూఏ/ బీఈ/బీటెక్ తోపాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: మేనేజర్‌కు 28-35 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 25-32 ఏళ్లు, మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 25-35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
చివరి తేదీ: 2025 అక్టోబర్ 2
వెబ్‌సైట్: https://sbi.bank.in/
ఖాళీలు 122
ఐఓబీలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్(ఐఓబీ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది.
అర్హత: డిగ్రీ/బీఆర్క్/బీటెక్/బీఈ, ఎంఎస్సీ/ ఎంఈ/ఎంటెక్ ఎంబిఏ/పీజీడీబీఏ/పీజీడీఎమ్ పాసై ఉండాలి.
వయస్సు: 2025 సెప్టెంబర్ 1 నాటికి పోస్టులను అనుసరించి 25 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్లను అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
చివరి తేదీ: 2025 అక్టోబర్ 3
వెబ్‌సైట్: iob.bank.in/Careers
ఖాళీలు 127
ఆర్‌బీఐలో గ్రేడ్-బీ ఆఫీసర్లు
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 120 ఆఫీసర్ గ్రేడ్-బీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
ఆఫీసర్స్ గ్రేడ్ బీ(జనరల్ కేడర్): 83
ఆఫీసర్స్ గ్రేడ్-బీ(డీఈపీఆర్ కేడర్): 17
ఆఫీసర్స్ గ్రేడ్-బీ(డీఎ్‌సఐఎమ్ కేడర్): 29
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ పాసై ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి.
వయస్సు: 2025 సెప్టెంబర్ 1 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 30
వెబ్‌సైట్: opportunities.rbi.org.in/
ఖాళీలు 120
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 15 , 2025 | 05:50 AM