Herbal Medicine: ఆరోగ్యానిచ్చే అటిక మామిడి
ABN, Publish Date - Aug 25 , 2025 | 02:38 AM
చాలా అనారోగ్యాలకు సహజ పరిష్కారాలు మన చుట్టూనే ఉన్నా చాలామందికి వాటి గురించి తెలియదు. అలాంటి ఓ మొక్క ‘అటిక మామిడి’. ఈ మొక్క గురించి వివరాలు తెలుసుకుందాం..
చాలా అనారోగ్యాలకు సహజ పరిష్కారాలు మన చుట్టూనే ఉన్నా చాలామందికి వాటి గురించి తెలియదు. అలాంటి ఓ మొక్క ‘అటిక మామిడి’. ఈ మొక్క గురించి వివరాలు తెలుసుకుందాం..
ఈ మొక్కను పునర్నవ మొక్క అని కూడా అంటారు. ఇది రోడ్ల పక్కన, పొలాల్లో, ఖాళీ స్థలాల్లో విరివిగా పెరుగుతుంది. ఇది భారతదేశంతో పాటు ఆసియా, ఆఫ్రికా, అమెరికా దేశాలలోనూ పెరుగుతుంది. ఈ మొక్కకు చిన్నని గులాబీ రంగు పువ్వులు పూస్తాయి. ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తారు. దీనిని మూత్రపిండాల సమస్యలను తగ్గించేందుకు వాడతారు.
కాలేయ సమస్యలు, రక్తహీనత, ఉబ్బసం, వాపులు తగ్గించేందుకు కూడా వినియోగిస్తారు. ఇంకా ఈ మొక్క వేరులను అధిక మూత్ర విసర్జన సమస్యకు పరిష్కారంగా వాడతారు. ఈ మొక్క మధుమేహం, రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే నేలంతా పరుచుకుని నేల కోతకు గురి కాకుండా కాపాడుతుందీ మొక్క.
డాక్టర్ శ్రీనాథ్,
వృక్ష శాస్త్రవేత్త, కన్హా శాంతివనం, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News
Updated Date - Aug 25 , 2025 | 02:38 AM