ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Womens World Snooker Champion: ఆమె సంకల్పం అనుపమా నం

ABN, Publish Date - Nov 26 , 2025 | 01:42 AM

సవాళ్లను స్వీకరించడం... అపజయాలను పాఠాలుగా మలుచుకోవడం... లక్ష్యం చేరేవరకు పట్టుదలగా ప్రయత్నించడం... ఇవే ఒక యోధుడిని తయారు చేస్తాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం... అనుపమా రామచంద్రన్‌...

విజేత

సవాళ్లను స్వీకరించడం... అపజయాలను పాఠాలుగా మలుచుకోవడం... లక్ష్యం చేరేవరకు పట్టుదలగా ప్రయత్నించడం... ఇవే ఒక యోధుడిని తయారు చేస్తాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం... అనుపమా రామచంద్రన్‌. కఠిన పరీక్షలు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకుండా... క్లిష్ట సమయాల్లో ఒత్తిడికి చిత్తవకుండా... ఆత్మస్థైర్యంతో అందలాన్ని అందుకుంది. ఇటీవల ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షి్‌ప గెలిచిన 23 ఏళ్ల అనుపమ... ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించి... నవ శకానికి నాంది పలికింది.

ఖతర్‌ రాజధాని దోహా... ఐబీఎ్‌సఎఫ్‌ ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షి్‌ప... అంతిమ సమరం... ప్రత్యర్థి ఎంగ్‌ఆన్‌ యీ... మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌. ఎన్నో ఏళ్లుగా నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌. కేవలం నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా ధైర్యాన్ని పరీక్షించే మ్యాచ్‌. చివరి ఫ్రేమ్‌. 2-2 వద్ద విజయం ఊగిసలాడుతోంది. అనుపమా రామచంద్రన్‌ చేతిలో క్యూ. నవచరిత రాయడానికి షాట్‌ దూరం. ఒక్క క్షణం ఆగి... ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఒత్తిడిలోకి వెళ్లకుండా తనను తాను స్థిమితంగా ఉంచుకుంది. ఏకాగ్రతతో, పూర్తి నమ్మకంతో షాట్‌ కొట్టింది. బంతి పాకెట్‌లోకి దూసుకుపోయింది. ఆ ప్రాంతమంతా చప్పట్లు, జయజయ ధ్వానాలతో మార్మోగింది. భారత్‌లో మొట్టమొదటిసారి ఒక మహిళ ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌గా అవతరించింది. అయితే ఈ గెలుపు అనుపమకు అంత సులువుగా దక్కలేదు. దీని వెనుక నిరంతర కృషి ఉంది. సడలని సంకల్పం ఉంది. దీనికి బలమైన పునాది 2015లో పడింది.

వేసవి క్యాంపుతో...

చెన్నైలో పుట్టి పెరిగిన అనుపమ కోరి స్నూకర్‌ను ఎంచుకోలేదు. ఆట మొదలుపెట్టేవరకూ దానిపై అసలు దాని గురించి తెలియదు. ‘‘అప్పుడు నాకు పదమూడేళ్లు. మా ఇంటికి దగ్గర్లో ‘మైలాపూర్‌ క్లబ్‌’ ఉంది. సెలవులు కావడంతో క్లబ్‌లో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. అక్కడ చెస్‌, స్నూకర్‌ మాత్రమే ఉన్నాయి. చెస్‌ ఇంట్లో ఆడుతూనే ఉంటాను కాబట్టి, స్నూకర్‌ నేర్చుకోవాలని అనుకున్నా. అంతేకాదు... ఆకుపచ్చని బోర్డు, రంగురంగుల బాల్స్‌, చేతిలో క్యూ... చూడగానే నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఎలా ఆడతారో తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువైంది. క్యాంపులో చేరాక అందులో లీనమైపోయాను. కోచ్‌ లో... నా ప్రతిభను చూసి స్నూకర్‌ కొనసాగించమని చెప్పారు’’ అంటూ చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్న అనుపమ... వేసవి శిబిరం పూర్తవగానే ప్రొఫెషనల్‌ కోచింగ్‌లో చేరింది.

అందుకే ప్రత్యేకం

చిన్నప్పుడు కోచ్‌లు అనుపమలో గుర్తించినవి... సడలని ఏకాగ్రత, ఓపిక. సాధారణంగా ఆ వయసు పిల్లల్లో ఈ లక్షణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటిని అలవర్చుకోవడానికి చాలామంది ఆటగాళ్లకు సంవత్సరాలు పడుతుందనేది శిక్షకుల మాట. అందుకే ఆమెను ప్రత్యేక ప్రతిభ గల అమ్మాయిగా పరిగణించారు. ఆ స్థాయిలోనే శిక్షణ ఇచ్చారు. స్పోర్ట్స్‌ పెర్‌ఫార్మెన్స్‌ స్పెషలిస్టు, తన మామయ్య అయిన కె.నారాయణన్‌ మార్గదర్శకత్వంలో అనుపమ ఆటలో మరింత పరిణతి సాధించింది. ఆయన నేతృత్వంలో సాంకేతిక అంశాలను ఆకళింపు చేసుకుంది. వ్యూహాలు నేర్చుకుంది. క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని ఎలా జయించాలో, మనోధైర్యంతో అడుగులు ముందుకు ఎలా వేయాలో తెలుసుకుంది. నిరంతర సాధనతో పరిపూర్ణ క్రీడాకారిణిగా తనను తాను తీర్చిదిద్దుకుంది.

మలుపు తిప్పిన గెలుపు

స్నూకర్‌, ఇంగ్లీష్‌ బిలియర్డ్స్‌లో ఎంతో పరిణతి సాధించిన అనుపమ... జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ అదరగొట్టింది. ఏకంగా ఎనిమిది జాతీయ జూనియర్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆమె కెరీర్‌ను 2017లో రష్యాలో జరిగిన ‘వరల్డ్‌ ఓపెన్‌ అండర్‌-16 స్నూకర్‌ చాంపయిన్‌షి్‌ప’ మలుపు తిప్పింది. అంచనాలు తలకిందులు చేస్తూ విజేతగా నిలిచింది. దాంతో అనుపమ సీనియర్‌ విభాగంపై కూడా దృష్టి పెట్టింది. 2023లో ‘ప్రపంచ మహిళల అండర్‌ 21 స్నూకర్‌’ టైటిల్‌ సాధించింది. మరుసటి ఏడాది ‘యూఎస్‌ ఉమెన్స్‌ ఓపెన్‌’లో రన్నర్‌పగా నిలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దాంతో ఈ ఏడాది ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానం దక్కించుకుంది. ఆమె కెరీర్‌ ఇదే అత్యున్నత ర్యాంక్‌.

ప్రపంచ చాంపియన్‌...

చిన్న వయసులోనే ఎన్నో మైలురాళ్లను అధిగమించిన అనుపమ... చదువును అశ్రద్ధ చేయలేదు. చెన్నైలోని ‘విద్యామందిర్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌’లో చదివిన ఆమె, ప్రస్తుతం వైష్ణవ్‌ మహిళా కళాశాలలో పబ్లిక్‌ పాలసీలో పీజీ చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి పోటీపడుతూనే... అటు ఆటను, ఇటు చదువును సమన్వయం చేసుకొంటోంది. ఇక ఈ నెల రెండో వారంలో దోహాలో జరిగిన ‘ఐబీఎ్‌సఎఫ్‌ ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షి్‌ప’లో టాప్‌ ర్యాంకర్‌ను ఓడించి నవ శకానికి నాంది పలికింది. భారత్‌ను చాంపియన్‌గా నిలబెట్టింది. ఈ గెలుపు ఆమెది మాత్రమే కాదు... ఈ క్రీడలో రాణించాలని కలలు కనే అమ్మాయిలు అందరిదీ. భారతీయ స్నూకర్‌ది. నిశ్శబ్దంగా, ఓపికగా, పట్టుదలగా, ఒక్కో అడుగు ముందుకు వేస్తూ... శిఖరాగ్రానికి చేరిన దృఢ సంకల్పానిది.

ఇవి కూడా చదవండి...

ఉగాదిలోగా 5 లక్షల ఇళ్లు పూర్తి: మంత్రి పార్థసారథి

ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2025 | 07:18 AM