Cancer In India: మనలో 40 శాతం మందికి క్యాన్సర్
ABN, Publish Date - Aug 12 , 2025 | 04:15 AM
మనలో 40% మంది వారి జీవితంలో క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారని జాతీయ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన తాజా సర్వేలు సూచిస్తున్నాయి. క్యాన్సర్ ప్రపంచవ్యాప్త ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా...
మీకు తెలుసా?
మనలో 40% మంది వారి జీవితంలో క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారని జాతీయ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన తాజా సర్వేలు సూచిస్తున్నాయి. క్యాన్సర్ ప్రపంచవ్యాప్త ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా మారిపోయింది. ఒక్క అమెరికాలో, ఈ ఒక్క ఏడాదిలోనే రెండున్నర లక్షల కొత్త క్యాన్సర్ కేసులు వెలుగులోకొచ్చాయి. ఆరు లక్షల మంది క్యాన్సర్ రోగులు మరణం అంచున ఉన్నారు. మన దేశంలో ప్రస్తుతానికి అత్యధికంగా 15 లక్షల మంది క్యాన్సర్ రోగులున్నారు. మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వారం, అండాశయాల క్యాన్సర్ సర్వసాధారణమైతే, పురుషుల్లో ఊపిరితిత్తులు, నోరు, నాలుక క్యాన్సర్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయుతే మిగతా దేశాలతో పోలిస్తే, మన దేశంలో క్యాన్సర్లను తొలి దశల్లోనే గుర్తిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. అయితే స్థూలంగా స్త్రీపురుషుల జీవితకాలంలో క్యాన్సర్ ముప్పు 38.9ుకి పెరిగింది. ముందస్తు వ్యాధి నిర్థారణ పరీక్షలతో, సమర్థమైన చికిత్సలతో క్యాన్సర్ మరణాల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నప్పటికీ, ఆ వ్యాధి బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఆరోగ్యకరమైన ఆహార, జీవన శైలులను అనుసరించడంతో పాటు, దైనందిన జీవితంలో వ్యాయామానికి స్థానం కల్పించాలి.
ఇవీ చదవండి:
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్
పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం
Updated Date - Aug 12 , 2025 | 04:15 AM