Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ABN, Publish Date - May 06 , 2025 | 01:09 PM
Security Drill: మాక్ సెక్యూరిటీ డ్రిల్ సందర్భంగా కీలక ప్రాంతాల నుంచి ఆకస్మాత్తుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మొబైల్ సిగ్నల్స్ నిలిపివేస్తామని కూడా తెలిపింది. ఇక, మాక్ డ్రిల్ సందర్భంగా ఇంకా ఏం జరుగుతుందంటే..
భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రేపు(బుధవారం) సెక్యూరిటీ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మాక్ డ్రిల్ నేపథ్యంలో తాత్కాళికంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా తాత్కాలికంగా మొబైల్ సిగ్నల్స్ నిలిపివేస్తామని తెలిపింది.
ట్రాఫిక్ డైవర్షన్స్, కీలక ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మాక్ డ్రిల్లో భాగమేనని పేర్కొంది. పబ్లిక్ అనౌన్స్మెంట్, తాత్కాలికంగా రాత్రిపూట కరెంటు నిలిపివేయడం, యుద్ధం సంభవించే పరిస్థితుల్లో ఎలాంటి ఎమర్జెన్సీని పాటిస్తారో అలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందని వెల్లడించింది. సెక్యూరిటీ మాక్ డ్రిల్ సందర్భంగా ఇంకా ఏమేమి జరుగుతాయో డీటేయిల్‌గా తెలుసుకుందాం.
సెక్యూరిటీ డ్రిల్ సందర్భంగా ఏం జరుగుతుంది..
ఎయిర్ రైడ్ సైరన్స్..
యుద్ధ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సెక్యూరిటీ డ్రిల్ జరుగుతోంది. సెక్యూరిటీ డ్రిల్ సందర్భంగా ప్రజల అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగిస్తారు. ఈ సైరన్ వినపడగానే వైమానిక దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు సురక్షిత ప్రదేశాలకి వెళ్లిపోవాలి.
క్రాష్ బ్లాక్ ఔట్స్
నగరాలలో సంపూర్ణంగా విద్యుత్ నిలిచిపోతుంది. వైమానిక దాడుల సమయంలో నగరాలను గుర్తించకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడ అమలు చేస్తారు. 1971 యుద్ధ సమయంలో భారతదేశం బ్లాక్కౌట్ ఎత్తుగడను ఉపయోగించింది.
కీలక సంస్థలు, ప్రాజెక్టుల రక్షణ
కమ్యూనికేషన్ టవర్స్, పవర్ ప్లాంట్స్, మిలిటరీ ఏరియాస్‌ను గుర్తించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు.
తరలింపు చర్యలు
సెక్యూరిటీ డ్రిల్‌లో భాగంగా హై రిస్క్ జోన్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. ఈ డ్రిల్ ద్వారా రెస్పాన్స్ టైం, లాజిస్టిక్స్ ఇష్యూస్‌ను గుర్తిస్తారు. నిజంగా యుద్దం జరిగినపుడు ఉపయోగపడేలా.. సమస్యలను అధిగమించే విధంగా చర్యలు ఉంటాయి.
పౌరులకు శిక్షణ
పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు కమ్యూనిటీ సెంటర్లలో యుద్దం గురించి శిక్షణ ఇవ్వనున్నారు. యుద్ధ సమయంలో సురక్షిత ప్రాంతాలను ఎలా గుర్తించాలి. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి. ఎమర్జెన్సీ సమయంలో ఆందోళనకు గురికాకుండా ఎలా ఉండాలనే అంశాలపై శిక్షణ ఇస్తారు.
ఇవి కూడా చదవండి
Security Drill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. కేంద్ర హోంశాఖ కీలక సమావేశం..
Success Story: ఒకే ఒక్కడు.. 78 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు..
Updated Date - May 06 , 2025 | 04:32 PM